తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్...

By Arun Kumar PFirst Published Dec 21, 2018, 4:02 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదిలోనే షాకిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామకాల కోసం తీసుకున్న మొదటి నిర్ణయానికే హైకోర్టు బ్రేకేసింది. జూనియర్ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను పాటించడంలేదని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది. 

గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని గిరిజన  తండాలకు, చిన్న గ్రామాలకు  పంచాయితీ హోదా కల్పించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లో పరిపాలన సజావుగా సాగేందుకు జూనియర్ పంచాయితీ కార్యదర్శులను భారీగా నియమించుకోవాలని భావించింది. ఇందుకోసం 9,355 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించడం...నోటిపికేషన్ వెలువడటం...రాతపరీక్ష జరగడం వెంటవెంటనే జరిగాయి.

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నియామక ప్రక్రియ వేగం తగ్గింది. ఇటీవల ఎన్నికలు ముగిసి మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఈ కార్యదర్శుల పోస్టులను వెంటనే భర్తీ  చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారులు కూడా స్పందించి జిల్లాల వారిగా కలెక్టర్ల ద్వారా నేరుగా మెరిట్ లిస్టును విడుదల చేశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

రిజర్వేషన్‌ నిబంధనలు ఉల్లంఘించారని, మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించకుండానే నేరుగా నియామకాలు చేపడుతున్నారని కొందరు అభ్యర్థులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 25 న నియామక  పత్రాలను అందిచడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని...అదే జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. దీంతో స్పందిచిన హైకోర్టు తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.  

click me!