ఈ నెల 31వ తేదీలోపు తెలంగాణలోని గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని...లేదంటే టీఎస్‌పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి ఫలితాలను కూడా వెల్లడించిన గురుకుల పీఈటీ, టీఆర్‌టి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గురుకుల పాఠశాలల్లో వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిందని కృష్ణయ్య గుర్తు చేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది వుందో దీన్నిబట్టే అర్థమవుతోందని కృష్ణయ్య ఎద్దేవా చేశారు.
undefined
ఇవాళ తెలంగాణ ఎంప్లాయ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో కృష్ణయ్య పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన నిరుద్యోగ సమస్యలపై మాట్లాడుతూ... ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే ప్రకటించిన గురుకుల పీఈటీ, టీఆర్‌టీ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టి....ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా వున్న 10వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.
2018 ఫిబ్రవరి 28 నాటికి టీఆర్‌టీలో 417 పోస్టులకు రాత పరీక్ష జరిగిందని కృష్ణయ్య గుర్తు చేశారు. ఇందులో అర్హత సాధించిన వారిలో 1:3 ప్రకారం సర్టిఫికెట్ పరిశీలన కూడా చేశారని అన్నారు. అనంతరం పలు కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆగిపోయిందని...వాటిని పరిష్కరించి వెంటనే అభ్యర్థులకు ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కృష్ణయ్య సూచించారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి, టీఎస్‌పిఎస్సీకి ఆయన హెచ్చరించారు.