విశ్వక్సేన్ సినిమా అంటే వివాదం.. ఇటీవల కాలంలో విశ్వక్‌సేన్ నుండి వచ్చిన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సమయంలో జరిగిన రచ్చ చూసి ఎవరైనా ఇదే మాట అంటారు. అసలు ఆ సినిమా జనాల్లోకి అంతగా వెళ్లడానికి కూడా ఆ వివాదమే కారణం అని చెబుతుంటారు.
'ఈ నగరానికి ఏమైంది'తో నటుడిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత తనలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆ మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్.. క్లీన్ హిట్‌ను అందుకున్నాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత చేసిన ఓరి దేవుడా మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమాకు క్లీన్ మూవీ అనే టాక్ వచ్చింది కానీ జనం ఆసక్తి చూపించలేదు. తమిళ వెర్షన్ తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేశాడు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు. సక్సెస్ దక్కలేదు కానీ ఓ మోస్తరుగా బ్రేక్ ఈవెన్ దగ్గరకు వెళ్లేలా కనిపిస్తున్నాడు.
బాక్సాఫీస్ వద్ద కాంతార భీబత్సం తట్టుకోవటం కష్టం అంటున్నారు. కాంతారా మినహాయించి చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోవడం కలిసొస్తున్నా విశ్వక్ తీసిన రీమేక్ ని చూసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా సినిమాలో వెంకీ పాత్ర చాలా పరిమితమనే టాక్ బయటికి రావడంతో ఫ్యామిలి ఆడియన్స్ కి ఎగ్జైట్ మెంట్ ఆవిరైపోయింది. ఫైనల్ గా కమర్షియల్ గా ఫెయిల్ అనేది తేలిపోయింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. అందులో వెరీటీగా సాగే `గామీ` ఒకటి కాగా..విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న `దాస్ కా ధమ్కీ` మరొకటి. ఈ రెండింటిలో `గామి` షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా మరో చిత్రం ఓకే చేసినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అందుతున్న సమాచారం మేరకు.. నందు హీరోగా `సవారీ` మూవీని రూపొందించిన సాహిత్ తో విశ్వక్ సేన్ ఓ భారీ ప్రయోగానికి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. కాలేజీ నేపథ్యంలో సాగే కథని ఇటీవల సాహిత్ ..విశ్వక్ సేన్ కు వినిపించాడట. కథ నచ్చడంతో ఈ మూవీని తానే స్వయంగా నిర్మిస్తాననని చెప్పినట్టుగా తెలుస్తోంది.నావల్టీ పాయింట్ తో , పవర్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందబోయే సినిమాకు ఏకంగా 25 కోట్లవుతుందని అంత మొత్తానికి సిద్ధపడి దర్శకుడు సాహిత్ మోత్కూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దర్శకుడు సాహిత్ ఆ మధ్య నందుతో గుర్రం టైటిల్ రోల్ లో సవారి తీశారు. డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు బంధం రేగడ్ అనే షార్ట్ ఫిలిం చాలా పేరు తీసుకొచ్చింది. అయితే ఓ ప్లాఫ్ దర్శకుడుకి ఈ సినిమా ఇచ్చారని, ఇంత బడ్జెట్ వర్కవుట్ కాదని ..అసలు ప్రాజెక్టు అఫీషియల్ గా ప్రకటించకుండానే రచ్చ మొదలైంది. విశ్వక్సేన్ కోరుకునేది కూడా ఇలాంటి హంగామానే అనుకుంటాను.
విశ్వక్‌సేన్ మాట్లాడుతూ… ఇప్పటివరకు కెరీర్ పరంగా ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా అనుకోకుండానే జరిగిపోతున్నాయి అంతే. అయతే ఏదీ ఎక్కువ, తక్కువ కాకుండా పనిచేస్తూ వెళ్తున్నాను అని చెప్పాడు విశ్వక్‌సేన్. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా చేస్తున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడట విశ్వక్. 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత బాక్సాఫీసు, స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించాలి అని అనుకున్నాను అని చెప్పాడు. ఇక ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలపై సంతృప్తిగానే ఉన్నాను. ఒక సినిమాకు, మరో సినిమాకు సంబంధం లేకుండా చేస్తూ వచ్చాను. ఇంకొన్నాళ్లు ఇలానే కొనసాగుతుంది అని చెప్పాడు. డైరెక్టోరియల్ డెబ్యూ సినిమా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రీకరణ పూర్తయిందట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఆ తర్వాత ‘గామి’ సినిమా విడుదలవుతుంది. ‘ఫలక్‌నామాదాస్ 2’ కూడా చేసే ఆలోచన ఉందట. అన్నీ ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట.