#Prabhas: మూడో ప్రపంచయుద్దంలో ప్రభాస్ పాత్ర ఏంటి? అమితాబ్ ట్విస్ట్

By Surya Prakash  |  First Published Nov 2, 2022, 6:56 AM IST

 ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్‌ పూర్తి చేసి 2024 ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. ఈ 2023 చివరి కల్లా సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్‌లో చాలా భాగం వీఎఫ్‌ఎక్స్‌ కోసమే కేటాయిస్తోంది చిత్ర యూనిట్. 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహానటి వంటి అద్భుత చిత్రాన్ని అందించిన నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రాజెక్ట్ కె టైటిల్ తో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌కు జోడిగా దీపికా నటిస్తోంది. ఈ చిత్రం గురించిన ఓ ఇన్ఫో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే...

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కించనున్నారు. ప్రభాస్, దీపికా పదుకోణెల ఇద్దరూ మూడో ప్రపంచ యుద్దంలో పాల్గొంటారు. మూడో ప్రపంచ యుద్దంలో ఆపేందుకు  ప్రభాస్ ని సూపర్ హీరోగా చేస్తారు అమితాబ్. పాజిటివ్ గా ఉండే అమితాబ్ పాత్రలో షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని, అదే కథను మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. అమితాబ్ పాత్ర చాలా శక్తివంతంగా,కీలకంగా ఉండబోతోంది.  

Latest Videos

  హైదరాబాద్‌లో ప్రభాస్ దీపికపై షూట్ కు ప్లాన్ చేశారు మేకర్స్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూటింగ్ జరగనుందట. ఇక ప్రాజెక్ట్ K ఊహాత్మక మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించబడుతుందట. యాక్షన్ అభిమానులను ఆహ్లాదపరిచేలా ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఇందులో ఐదు భారీ యాక్ష‌న్ సీక్వెన్సెస్ ఉంటాయ‌ట‌. మూడ‌వ ప్ర‌పంచ యుద్దం నేప‌ధ్యంలో ఈ సుదీర్ఘ యాక్ష‌న్ సీన్స్ ఉంటాయ‌ని స‌మాచారం.

ఇందు కోసం హాలీవుడ్ కి చెందిన ఐదుగురు ఫైట్ మాస్ట‌ర్స్ ని రంగంలోకి దింపార‌ట నాగ్ అశ్విన్. ఒక్కో యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక్కో ఫైట్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే అవెంజ‌ర్స్, గాడ్జిల్లా, కింగ్ కాంగ్ త‌దిత‌ర హాలీవుడ్ చిత్రాల‌కు ఉప‌యోగించిన కెమెరాల‌ను ఈ మూవీకి ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

రీసెంట్ గా ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్‌ సినిమా పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ప్రాజెక్ట్‌ కే అనేది వర్కింగ్ టైటిల్‌ మాత్రమేనని అసలు టైటిల్‌ ఏంటన్న దానిపై ఇంకా బయిటకు రాలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఓ విజువల్‌ వండర్‌లా నిర్మిస్తున్నారు.  ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్‌ పూర్తి చేసి 2024 ఏప్రిల్‌ 10న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. ఈ 2023 చివరి కల్లా సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్‌లో చాలా భాగం వీఎఫ్‌ఎక్స్‌ కోసమే కేటాయిస్తోంది చిత్ర యూనిట్. 

ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణెతో పాటు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ  చిత్రానికి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు.. స్క్రిప్టు విష‌యంలో సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రాని స‌రికొత్త పాయింట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేయ‌నున్నారు.
 

click me!