"అశోకవనంలో అర్జున కళ్యాణం" విషయానికి వస్తే యువహీరో విశ్వక్ సేన్ మరొక హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారనే చెప్పాలి.
సినిమా నేపధ్యం లేకుండా వచ్చి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని సక్సెస్ అవుతన్నాడు విశ్వక్ సేన్ ఒకరు. ఈ యంగ్ హీరో ఫలక్ నుమా దాస్ మూవీతో హిట్ కొట్టి సెన్సేషన్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా ఈ నగరానికి ఏమైంది, హిట్, పాగల్ సినిమాలలో నటించి యువ హీరోలకు పోటీగా నిలిచాడు. అయితే ఇప్పుడు ఒక విషయం విశ్వక్ గురించి వైరల్ గా మారింది. అదే ఆయన రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసారని వినపడుతోంది.
తాజాగా ఈయన నటించిన మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజైంది. ఇందులో మిడిల్ క్లాస్ పెళ్లి కాని యువకుడిగా నటించాడు. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పాటలు టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఎదురుచూసారు. అనుకున్నట్లుగానే వచ్చి సినిమా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో విశ్వక్ రెండు సినిమాలు సైన్ చేసారని వినికిడి. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి సైన్ చేసారని వినికిడి. దాంతో తన వెనక పడుతున్న నిర్మాతలకు ఇక నుంచి మూడు కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పారట. అంతకు ముందు ఆయన కోటిన్నర నుంచి రెండు లోపే రెమ్యునరేషన్ ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా కోటిన్నర దాకా పెంచటంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు.
అయితే ఈ సినిమాకు ముందు కోటి రూపాయల రెమ్యునరేషన్ కే ఓ సినిమా సైన్ చేసారు. ఆ సినిమా ఇప్పుడు విశ్వక్ చేస్తారా చేయరాఅనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక "అశోకవనంలో అర్జున కళ్యాణం" విషయానికి వస్తే యువహీరో విశ్వక్ సేన్ మరొక హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారనే చెప్పాలి. రొమాంటిక్ కామెడీ సినిమాగా కొత్త డైరెక్టర్ విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో మే 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. విడుదలకు ముందు విశ్వక్ సేన్ కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ అవేమీ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించలేదు. నిజానికి అవన్నీ ఈ సినిమాకి హైప్ మరింత పెంచాయని చెప్పుకోవచ్చు.
రుక్సార్ ధిల్లాన్ మరియు రితిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విశ్వక్ సేన్ ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ముందుకు వచ్చారు హిట్ సినిమా తర్వాత విశ్వక్ సేన్ కెరియర్ లో మరొక మళ్లీ మైలురాయిగా ఈ సినిమా నిలవనుంది. గోపరాజు రమణ, కాదంబరి కిరణ్, కేదార్ శంకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.