హడావిడిగా ‘పాగల్’ రిలీజ్ డేట్ ప్రకటన, వెనక ఏం జరిగింది?

By Surya Prakash  |  First Published Aug 8, 2021, 8:44 AM IST

ఆగస్టు14న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ ఎర్ర గులాబీని పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.


 విష్వక్ సేన్ తాజా చిత్రం ‘పాగల్’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి దిల్‌రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా బెక్కెం వేణుగోపాల్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ‌క‌థా చిత్రమిది. ఇప్ప‌టికే ఈసినిమా టీజ‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను ‘పాగల్’ సినిమాలో చేస్తున్నారు విష్వ‌క్‌సేన్‌. ఈ సినిమా ఓటీటిలో వస్తుందా..థియేటర్‌ రిలీజా అనే మల్లగుల్లాలు చాలా రోజులు  నుంచి సాగుతున్నాయి. చివరకు థియోటర్ వైపే మొగ్గు చూపారు. అయితే థియోటర్ కు రావటం వెనక కొంత డిస్కషన్ జరిగిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అదేంటో చూద్దాం. 

టిక్కెట్ రేట్లు, ఆక్యుపెన్సీ సమస్యలు ఉన్నా తిమ్మరసు, ఇష్క్  సినిమాలను వదిలారు. అదిరిపోయేలా కాకపోయినా ఫరవాలేదనిపించుకునేలా వసూళ్లు వచ్చాయి. ఇంకా థియేటర్లలోనే రన్నింగ్ లో ఉన్నాయి. దాంతో మొన్న శుక్రవారం ఎస్ ఆర్ కళ్యాణ మండపం, ఇంకా మరి కొన్ని సినిమాలు వదిలారు. ఎస్ ఆర్ కళ్యాణమండపం మొదటి రోజు అన్ని సెంటర్ల నుంచీ మంచి ఓపినింగ్స్ రప్పించుకుంది. దాంతో నెక్ట్స్ వీక్ కూడా థియోటర్ లో సినిమా ఉంటే బెస్ట్ ..మెల్లిగా జనం అలవాటు పడుతున్నారు అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెద్దలు ప్లాన్ చేసారు. 

Get ready to WATCH in THEATRES on August 14th💥

Mass Ka Dass pic.twitter.com/qN4zh16W8y

— Sri Venkateswara Creations (@SVC_official)

Latest Videos

అందుకు దిల్ రాజు ముందుకు వచ్చారు. దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ అయిన పాగల్ సినిమాను రిలీజ్ చేయమని అడగటంతో ఆయన ఓకే అన్నారు. నిజానికి ఈ సినిమాని మంచి రేటుకు  ఓటిటికి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఇండస్ట్రీ కు హెల్ప్ చేసినట్లు ఉంటుంది ,హిట్ టాక్ వస్తే ఓటీటిలో మంచి వ్యూస్ వస్తాయి అని .... విష్వక్ సేన్ నటించిన ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయటానికి డిసైడ్ అయ్యిపోయారని సమాచారం. 
 
 ఇక  రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచాయి. ‘పాగల్’ రిలీజ్ డేట్ చాలా ద‌గ్గ‌రగా ఉంది. దీంతో మేక‌ర్స్ ఈ సినిమాకు భారీ ఎత్తున ప్ర‌మోష‌నల్  కార్య‌క్ర‌మాల‌ను ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా క‌నిపించ‌నున్నారు.  

న‌టీన‌టులు: విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్రాన్ చౌద‌ర‌ని, మేఘా లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు
బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: బెక్కెం వేణుగోపాల్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ కుప్పిలి
సినిమాటోగ్రఫీ: మ‌ణికంద‌న్‌
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌
పాట‌లు: చంద్రబోస్, రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, అనంత శ్రీరాం
ఫైట్ మాస్ట‌ర్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌
డాన్స్ మాస్ట‌ర్‌: విజ‌య్ బిన్ని
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సిద్ధం విజ‌య్ కుమార్‌ 

click me!