పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాలు రెండూ క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ కాబోతుండటంతో ఏ మూవీ ఎలా ఉంటుంది, క్రిస్మస్ విజేత ఎవరు అనే దానిపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం డిసెంబర్ 25న విడుదల కానుంది. అదే సమయానికి మరో భారీ చిత్రం కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు భారీ అంచనాలతో రూపొందిన “కేజీఎఫ్-2”. ఈ చిత్రం “పుష్ప”రాజ్ కు పోటీగా రానుంది అని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ “కేజీఎఫ్”కు సీక్వెల్ గా ఈ “కేజీఎఫ్-2″ను రూపొందించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా రిలీజ్ కు బ్రేకులు వేసింది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల రీఓపెన్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఇక పెద్ద సినిమాలన్నీ విడుదలకు వరుస కడుతుండడంతో ఇప్పుడు డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో “పుష్ప”రాజ్ ను యష్ “కేజీఎఫ్-2” ద్వారా ఢీ కొట్టబోతున్నాడు అంటున్నారు.
ఈ నేపధ్యంలో కేజిఎఫ్2 రిలీజ్ పై మరింత ఇంట్రస్ట్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. డిసెంబర్ లో పుష్ప కన్నా 5 రోజుల ముందు… డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం. ఏదైమైనా “కేజీఎఫ్-2” నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ ఈ వార్తలపై ఓ క్లారిటీ రాదు.
‘కేజీఎఫ్’ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేనవసరం. ఎలాంటి అంచనాలు లేకుండా 2018 విడుదలైన ఈ మూవీ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ మూవీకి సిక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది.