RC16: చరణ్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ఆపేయటానికి షాకింగ్ రీజన్

By Surya Prakash  |  First Published Nov 6, 2022, 2:40 PM IST

జెర్సీ సినిమాతో  అందరినీ  మెప్పించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరితో రామ్‌ చరణ్‌ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని రామ్‌ చరణ్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో అసలు ఈ ప్రాజెక్టు ఆగిపోవటానికి కారణం ఏమిటి అనే విషయమై మీడియాలో చర్చ మొదలైంది.  



కొద్దికాలం క్రితం రామ్‌ చరణ్‌ (Ram charan) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. RC16గా చెప్పబడుతున్న   ఈ సినిమా ఆగిపోయిందనే వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తపై చిత్ర వర్గాలు కూడా అధికారికంగా క్లారిటీ ఇచ్చాయి. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ట్విటర్‌ వేదికగా ప్రకటించాయి.

‘‘మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, గౌతమ్‌ తిన్ననూరిల ప్రాజెక్టు ఆగిపోయింది. అతి త్వరలోనే రామ్‌ చరణ్‌ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం’’ అని ట్వీట్‌ చేసింది. అయితే.. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయంపై మాత్రం ఎలాంటి వివరణ లేదు. ఈ నేపధ్యంలో అసలు ఈ ప్రాజెక్టు ఆగిపోవటానికి కారణం ఏమిటి అనే విషయమై మీడియాలో చర్చ మొదలైంది. దాని ద్వారా తెలిసిన విషయం..రామ్ చరణ్ ఈ సినిమా ఈ ప్రాజెక్టు వద్దనుకోవటానికి ఏకైక కారణం..కథ నచ్చకపోవటం కాదు..గ్లోబుల్ మార్కెట్ ని టార్గెట్ చేసేలా లేదని తెలిసింది.

Latest Videos

RRR రిలీజ్ తర్వాత కథల ఎంపికలో మార్పు వచ్చింది. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వటం, మార్కెట్ పెరగటంతో అలాంటి లార్జర్ దేన్ లైఫ్ కథలనే రామ్ చరణ్ ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకోసం కసరత్తు చేస్తున్నారు. లోకల్ కంటెంట్ తో నేషనల్ ,ఇంటర్నేషనల్ మార్కెట్ ని గెలవలేమని ఫిక్స్ అయ్యారట. శంకర్ తో చేస్తున్న సినిమా కూడా ప్యాన్ ఇండియా మూవీనే. కాబట్టి ఇకపై చేసే సినిమాలు, ఎంచుకునే కథలు ఆ స్దాయిలోనే ఉండాలని డిసైడ్ అయ్యి...ఈ ప్రాజెక్టుని ఆపారని చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్లు..హిందీలో ఇదే దర్శకుడు చేసిన జెర్శీ రీమేక్ డిజాస్టర్ అవ్వటం కూడా మరో కారణం. తన కెరీర్ లో నెక్ట్స్ లెవిల్ లో ప్రవేశించిన టైమ్ లో రిస్క్ తీసుకోదలచలేదంటున్నారు. ఇదంతా రాజమౌళి ఇచ్చిన RRR ఎఫెక్ట్ కావటం విశేషం.
 
ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలకపాత్రలు పోషింస్తుండగా తమన్‌ స్వరాలు అందించనున్నారు. మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి యువ హీరో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేస్తారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరి ఆ కథేంటి? రామ్‌చరణ్‌ కోసం సిద్ధం చేసిన కథే.. విజయ్‌తో తీస్తారా? లేదా కొత్తదా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

click me!