Ram Charan: ఆ టైటిల్ కే లాక్ అయిన రామ్ చరణ్, త్వరలో ప్రకటన

By Surya Prakash  |  First Published Jun 17, 2022, 7:04 AM IST

 ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత  రామ్ చరణ్ చేస్తున్న చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయనటంలో సందేహం లేదు.  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ , అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. రకరకాల టైటిల్స్ వినపడ్డాయి.

విశ్వంబర టైటిల్ ని ఓకే చేద్దామనుకున్నారు కానీ అది బాగా క్లాస్ గా ఉందని ఫీలయ్యారట. అలాగే సర్కారోడు, ఆఫీసర్ ఇలా చాలా టైటిల్స్ అనుకున్నారు. ఫైనల్ గా...అధికారి అనే టైటిల్  దగ్గర ఆగిటనట్లు  సమాచారం.  రామ్ చరణ్ ఈ టైటిల్ కే ఓటేసారట. దాంతో టైటిల్ పవర్​ఫుల్​గా ఉండటంతో ప్రచారంలో ఉన్న ‘అధికారి’ పేరే ఖాయం చేద్దామని శంకర్ అన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని వినికిడి. 
  
ఇక  ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత  రామ్ చరణ్ చేస్తున్న చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయనటంలో సందేహం లేదు.  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 150 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట.  2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
 ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించనుండగటంతో పాటు, ఓ మాస్ పాత్రతో  ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  రామ్ చరణ్ ఆ మధ్యన  ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు . "తెర మీద అయిన సినిమాలు చూసి ఇష్టపడతాం. ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగా కంటే ఒక ఫ్యాన్ బాయ్ లాగా నేను సెట్లో ఉండేవాడిని. ప్రతి పాత్రలోనూ స్క్రిప్టు లోనూ ఆయన కనిపిస్తుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని రామ్ చరణ్.  

Latest Videos

click me!