విలన్ గా రవితేజ కన్ఫర్మ్...ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

By Surya Prakash  |  First Published Oct 18, 2022, 7:04 AM IST

 ఆ పాత్రలో ..రవితేజ ను అడుగుతున్నట్లు సమాచారం. అంటే ఆ పాత్ర విలన్ పాత్ర. మరి రవితేజ అభిమానులు ఆ పాత్ర చేస్తే ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రశ్న. 


 శింబు హీరోగా ఎస్. జె. సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ `మానాడు`. తమిళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరుపున హీరో రానా దక్కించుకున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చే బాధ్యతల్ని రానా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు అప్పగించాడట. ఇందు కోసం ఆయనకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో ఒప్పేసుకుని చేస్తున్నారని సమాచారం.   ఈ రీమేక్ కు దశరథ్ దర్శకత్వం వహించనుండగా రవితేజ సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. 

`భవదీయుడు భగత్ సింగ్` అప్డేట్స్ కోసం ఎదురుచూడలేక ఫ్యాన్స్ నీరసపడిపోయారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేక స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు.   ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ `మానాడు` తెలుగు రీమేక్ కు వర్క్ చేస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

Latest Videos

ఎస్ జె సూర్య పాత్రలో ..రవితేజ ను అడుగుతున్నట్లు సమాచారం. అంటే ఆ పాత్ర విలన్ పాత్ర. మరి రవితేజ అభిమానులు ఆ పాత్ర చేస్తే ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రశ్న. అయితే చాలా డిఫరెంట్ గా సూర్య ,విభిన్నమైన మ్యానరిజంతో చేసారు ఆ పాత్రని. కాబట్టి ఆ పాత్రని రవితేజ చాలా ఇష్టపడి చేస్తాడని అంటున్నారు. మరో ప్రక్క శింబు చేసిన పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ కనిపించనున్నారని చెప్తున్నారు. అయితే ఇవేమీ కావు నాగచైతన్య ని ఆ పాత్ర కోసం అడుగుతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

రానా... ఆసియన్ సునీల్ కలిసి ఈ సినిమాను నిర్మించబొతున్నారు. 2021 నవంబర్ లో విడుదలైన ఈ తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కొల్లగొట్టి శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక సూపర్ హిట్ అనే టాక్ రాగానే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. మానాడు తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. తమిళంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా.. తెలుగులో ఓటిటిలో మాత్రమే విడుదలైంది. ఇక అప్పటినుండి ఫ్యాన్స్ లో ఈ సినిమాను తెలుగులో ఏ హీరోతో రీమేక్ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.  

click me!