ఈ చిత్రంలో నితిన్ సరసన మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ పూర్తిగా భిన్నమైన పాత్రలో నితిన్ ను చూపించబోతున్నాడు.
సినీ పరిశ్రమలో విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తాము చేస్తున్న హీరో గత చిత్రం సూపర్ హిట్టైతే బిజినెస్ ..ఆటో మేటిగ్గా పెరిగిపోతుంది. అలాగే డిజాస్టర్ అయితే ఆ మొత్తం బరువు వచ్చి తమ సినిమాపై పడుతుంది. సినిమా మధ్యలో ఉండగా ఏమీ చేయలేని పరిస్దితి. ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ ..నితిన్ చిత్రానికి వచ్చి పడిందని ఫిల్మ్ నగర్ టాక్. ఆ ఇంపాక్ట్ ..దర్శక,రచయిత వక్కంతం వంశీని ఇబ్బంది పెడుతోందంటన్నారు. వివరాల్లోకి వెళితే...
నితిన్ హీరోగా తన 32వ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ బేనర్ లో చేస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితారెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమయింది. ఈ సినిమా ప్రారంభం నాటికి నితిన్ నటించిన `మాచర్ల నియోజకవర్గం` సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మాచర్ల నియోజకవర్గం సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. కానీ మాచర్ల నియోజక వర్గం చిత్రం డిజాస్టర్ అయ్యింది. నితిన్ కు ఎక్కడ లేని బ్యాడ్ నేమ్ తెచ్చి పెట్టింది. దాంతో ఆ ప్రభావం ఖచ్చితంగా నితిన్ నెక్ట్స్ ప్రాజెక్టుపై పడుతోందని సమాచారం.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..నితిన్ ...వక్కంతం తో చేయబోతున్న చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది. స్క్రిప్టు విషయంలో మరిన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సూచించాడని అంటున్నారు. మాచర్ల నియోజక వర్గం రిజల్ట్ తో నితిన్ పూర్తి ఆలోచనలో పడిపోయాడని అంటున్నారు. మరో ప్రక్కన నిఖిల్ వంటి హీరో ప్యాన్ ఇండియా లెవిల్ లో హిట్టైన కార్తికేయ 2 చేయటం కూడా నితిన్ ..తన ప్రాజెక్టులు,కాన్సెప్టులు మార్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలుస్తోంది. రొటీన్ గా సాగే కథలకు, యాక్షన్ స్టోరీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కొత్తగా కాన్సెప్టు ఉంటేనే ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. వక్కంతం వంశీ..స్క్రిప్టు మార్చుకుని వస్తే...మళ్లీ మొదలవ్వచ్చేమో అంటున్నారు.
ఈ చిత్రంలో నితిన్ సరసన మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ పూర్తిగా భిన్నమైన పాత్రలో నితిన్ ను చూపించబోతున్నాడు. నితిన్ కోసం ఆయన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు. ప్రముఖ టెక్నీషియన్స్ పని చేయనున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ నెం 9గా రూపొందిస్తుండగా, రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతుండగా సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.గా పనిచేస్తున్నారు.