పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు కొన్ని చర్చలు కూడా జరిగాయని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ టైటిల్ కూడా అనుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ..ఎప్పుడూ వార్తలో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ట్వీట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఆయనకు,పవన్ కళ్యాణ్ కు మధ్య సోషల్ మీడియాలో సాక్షిగా యుద్దాలు జరిగాయి. ఈ మధ్య గ్యాప్ ఇచ్చారు. అలాగే ఆ మధ్య పవన్ ని సెటైర్ చేస్తూ పవర్ స్టార్ అనే సినిమా సైతం చేసారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు కొన్ని చర్చలు కూడా జరిగాయని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ టైటిల్ కూడా అనుకున్నారని ప్రచారం జరుగుతోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు “ప్యాకేజ్ స్టార్” అనే టైటిల్ ఫిక్స్ చేసి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫండింగ్ కూడా ఓ రాజకీయ పార్టీ నుంచి వచ్చినట్లు వినపడుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ ...మూడు పెళ్లిళ్ల చుట్టు తిరుగుతుందని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఏపీ ఎలక్షన్స్ 2024 ముందు రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే... ఇక పవన్ ఫ్యాన్స్ కి బద్ద శత్రువు, పక్కలో బల్లెం లాంటోడు. పవర్ స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకొని సినిమాలు తీసి, సొమ్ము చేసుకుంటున్న నీతిలేని స్వార్ధపరుడు అనేది పవన్ అభిమానుల భయంకరమైన ఆరోపణ. వర్మ మూవీ పవర్ స్టార్ ఎంతటి సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పవన్ జీవితాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆయన చేసిన ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ముఖ్యంగా గడ్డి తిన్నావా సాంగ్, మరియు ట్రైలర్ లో సన్నివేశాలు వివాదంగా మారాయి. వర్మ కోరిక తీరింది. సినిమా విడుదలై, ఎంతో కొంత డబ్బులు తెచ్చిపెట్టింది. పవన్ వీరాభిమానులం అని చెప్పుకొనే కొందరు వర్మపై కోపంతో సినిమాలు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినీ, రాజకీయ పరిణామాలపై తరచుగా స్పందిస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలుస్తారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై స్పందించారు. ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బాగోదని.. చెప్పు చూపించి మరీ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై ప్రశంసలు కురిపించారు ఆర్‌జీవీ. ''ఆ ప్రసంగం నీతి కొన్ని అంతర్గత వృత్తాలలో అగమ్యగోచరంగా చూడవచ్చు కానీ.. పవన్ కళ్యాణ్ ప్రశంగం నేను గత 100 సంవత్సరాలలో విన్న అత్యంత ప్రభావవంతమైన స్పీచ్'' అంటూ ఆకాశానికి ఎత్తాడు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్.