#Dilraju: దిల్ రాజుకు మైత్రీ-యూవీ షాక్, రివేంజ్ ప్లాన్? !

By Surya Prakash  |  First Published Oct 24, 2022, 6:58 AM IST

'వారసుడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. 


ఈ సంక్రాంతి స్టార్ ప్రొడ్యూసర్,ఎదురులేని డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు అగ్నిపరీక్ష గా మారేటట్లే కనపుడుతోంది. పెద్ద బ్యానర్స్ ఒకటయ్యి..ఆయనకు ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు మీడియా వర్గాల  సమాచారం. సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తున్న 'వారీసు'ని  తెలుగులో 'వారసుడు'గా  విడుదల అవుతోంది. మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య'  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ నటించిన 'ఆది పురుష్' కూడా రిలీజ్ కాబోతోంది. నైజాం ఏరియాలో ఈ నాలుగు సినిమాలకు సమానంగా థియేటర్లని కేటాయించాలి. అది అంత త్వరగా తేలే విషయం కాదు. ఏ హీరో కి మెయిన్  థియేటర్ తో పాటు ఇతర కీలక థియేటర్లు దక్కకపోతే  రచ్చ మొదలైపోతుంది. దాంతో నిర్మాణ సంస్దలు ఆచి,తూచి ముందుకు అడుగేస్తాయి. 
 
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే మెగాస్టార్ హీరోగా నటిస్తున్న 154వ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. అయితే బాలకృష్ణ చిరంజీవి సినిమాలు రెంటిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న నేపథ్యంలో సంస్ద మొదలవుతుంది అంటున్నారు.  ఒకటి రెండు రోజుల గ్యాప్ తో సినిమాలను విడుదల చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి  చిరంజీవి, బాలకృష్ణ ఈ రెండు సినిమాలకు సంబంధించిన నైజాం, వైజాగ్ రైట్స్  సంపాదించేందుకు ప్రయత్నాలు చేశారు.

కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆ రెండు సినిమాల హక్కులు బయట వారికి అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శశి మేనేజ్ చేసే విధంగా ఒక సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసి తమ సినిమాలను తామే డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరో పెద్ద నిర్మాణ సంస్థను కూడా కలుపుకోవాలని వారు భావిస్తున్నట్లు మీడియా వర్గాల సమాచారం.

Latest Videos

అందులోనూ  నైజాంలో థియేటర్లు ఎక్కువ ఏషియన్ సంస్థకు ఉన్నాయి. కాబట్టి దిల్ రాజుతో పెద్దగా సమస్య లేనట్టే. ఇదిలా ఉంటే  దిల్ రాజు ఆది పురుష్ సినిమా హక్కుల కోసం కూడా ప్రయత్నించారని కానీ ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న యూవీ సంస్థ ఆ హక్కులు కూడా దిల్ రాజుకు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ‘వారసుడు’ సినిమాని భారీగా రిలీజ్ చేయటానికి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తనకు సినిమా రైట్స్  ఇవ్వకపోతే ఖచ్చితంగా తన సినిమాని సంక్రాంతి టైమ్ లోనే  రిలీజ్ చేసేందుకే దిల్ రాజు సిద్ధమవుతున్నారు  ఫిల్మ్ సర్కిల్స్ లో  పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.  అయితే విజయ్ సినిమా కంటే ఖచ్చితంగా ఈ మూడు సినిమాలకే తెలుగులో క్రేజ్ ఉంటుందనేది నిజం.

click me!