ఔం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో మస్తు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్, ఆదిపురుష్.. ఇలా అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. ముఖ్యంగా ఆదిపురుష్ పై అందరి దృష్టీ ఉంది. వాస్తవానికి ఈ చిత్రం నుంచి మాత్రం చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ ఈ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ ఉంది. బిజినెస్ సైతం మాత్రం మొదలైపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటిటి రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. అదీ మామూలు రేటుకు కాదంటున్నారు.
ఔం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలంటోంది ట్రేడ్. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త బయిటకు వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో మా హీరో సత్తా ఇది చూడండంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీఖాన్ మరియు లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి భూషణ్ కుమార్, ఓం రౌత్ లు నిర్మాణం వహిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా 3డి లో ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది.