Prabhas: ప్రభాస్ వెనకడుగు, ఆ ప్రాజెక్టు నో చెప్తాడా? షాకింగ్ రూమర్స్

By Surya Prakash  |  First Published Mar 14, 2022, 9:05 AM IST

యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సాహో" మొదటి రోజు నుంచి అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కానీ "రాధే శ్యామ్" చాలా మామూలు రెస్పాన్స్ తో మొదలైంది.  డ్రాప్ దారుణంగా ఉంది. ఈ సినిమాని కేవలం ప్రభాస్ అభిమానులు తప్ప మిగతా వారు ఎవరు సినిమా చూడడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు.



ప్రతీ శుక్రవారం సినిమా వాళ్ల లెక్కలు మారిపోతాయి. హీరోకు ఒక సినిమా హిట్టైందంటే వచ్చే క్రేజ్ వేరు. అలాగే సినిమా ఫ్లాప్ అయితే కెరీర్ పై దాని ఇంపాక్ట్ వేరు. అప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు ఫ్లాఫ్ అవ్వాగానే ఓ సారి తరచి చూసుకోవాల్సిన పరిస్దితి వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ పరిస్దితి అదే అంటున్నారు. "బాహుబలి" సినిమా ఘన విజయం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కానీ అందులో ఒకటి కూడా అనుకున్న స్థాయిలో మెప్పించటం లేదు. "సాహో" సినిమా కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక తాజాగా విడుదలైన "రాధే శ్యామ్" సినిమాకి కూడా అదే పరిస్థితి.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సాహో" మొదటి రోజు నుంచి అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కానీ "రాధే శ్యామ్" చాలా మామూలు రెస్పాన్స్ తో మొదలైంది.  డ్రాప్ దారుణంగా ఉంది. ఈ సినిమాని కేవలం ప్రభాస్ అభిమానులు తప్ప మిగతా వారు ఎవరు సినిమా చూడడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపధ్యంలో ప్రభాస్ తన కెరీర్ లో ఆచి,తూచి సినిమాలు చేయాల్సిన టైమ్ వచ్చేసిందంటున్నారు.

Latest Videos

 ఇక మరోవైపు ప్రభాస్ చేతిలో వరస ప్రాజెక్టులు ఉన్నాయి.  అయితే వాటిన్నటి గురించి ఏ టాపిక్ లేదు. కానీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తారంటు వస్తున్న  సినిమా గురించే అందరూ మాట్లాడుతున్నారు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ మారుతి సినిమాలలో కనిపించవు. కేవలం కామెడీ ఎంటర్టైనర్ లు తీయడంలో మాత్రమే మారుతి దిట్ట. కాబట్టి ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్ తో కామెడీ సినిమా అంటే అభిమానులు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా అంటున్నారు. రాధేశ్యామ్ రిజల్ట్ చూసిన ప్రభాస్ ...నో చెప్పే అవకాసం ఉందంటున్నారు.

అయితే మారుతితో చేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. అతి తక్కువ టైమ్ లో సినిమా పూర్తైపోతుంది. బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది. మారుతితో తీస్తే కనుక ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సోషల్ మీడియా జనం మాత్రం సాహో,రాధేశ్యామ్ తర్వాత అయినా ప్రభాస్ డైరక్టర్స్ ఎంపికలో మార్పు రావాలంటున్నారు.ఇప్పటికే రాధేశ్యామ్ ఒక కాస్ట్లీ మిస్టేక్ గా ప్రభాస్ కెరీర్ లో మిగిలింది. ఇంకా అలాంటివి మరికొన్ని వస్తే బాహుబలితో వచ్చిన క్రేజ్ మొత్తం మాయం అయ్యిపోతుందని  అభిమానులు కంగారు పడుతున్నారు.

click me!