Radhe Shyam:ప్రభాస్ గురించి పూజ చెప్పిన మ్యాటర్ విని షాకైన మీడియా?

By Surya Prakash  |  First Published Mar 10, 2022, 1:51 PM IST


ఇక వీళ్లిద్దరికి పడటం లేదనే వార్త ...ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పట్నుంచి వినిపిస్తోంది. తాజాగా మరోసారి చాలా గట్టిగా వినిపించిది. ఈ విషయంపై హీరోయిన్ పూజాహెగ్డే ని మీడియా వారు ప్రశ్నించారు. దానిపై ఆమె పాజిటివ్ గా స్పందించింది. 



ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓవైపు `రాధేశ్యామ్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై టూ హైదరాబాద్ ప్రచారం పనుల్లో నిమగ్నమైంది. డార్లింగ్ ప్రభాస్ తో కలిసి ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటుంది.  మరో ప్రక్క సోషల్ మీడియలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ కి ఫుల్ బిజీగా ఉంటోంది. మీడియాకు ఇంటర్వూలు ఇస్తోంది. ఈ నేపధ్యంలో  ప్రభాస్-పూజాహెగ్డే మధ్య పెద్ద గొడవ జరిగిదంటూ వచ్చిన వార్త మరో సారి హైలెట్ అయ్యింది. అలాగే కొన్ని ప్రమోషన్స్ లో కూడా ఇద్దరూ ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారు. 

ఇక వీళ్లిద్దరికి పడటం లేదనే వార్త ...ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పట్నుంచి వినిపిస్తోంది. తాజాగా మరోసారి చాలా గట్టిగా వినిపించిది. ఈ విషయంపై హీరోయిన్ పూజాహెగ్డే ని మీడియా వారు ప్రశ్నించారు. దానిపై ఆమె పాజిటివ్ గా స్పందించింది. 
 
పూజా మాట్లాడుతూ.....ప్రభాస్  గొప్ప మనసున్న వ్యక్తి అని, షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని.. ప్రతిరోజు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారని చెప్పింది. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేంటని ఎదురు ప్రశ్నించింది. ప్రభాస్ తో ఎవరూ మాట్లాడకుండా ఉండలేరని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. 

Latest Videos

అలాగే ప్రభాస్ తో నిజంగా తనకు గొడవ జరిగితే, అదే హీరో నుంచి తనకు భోజనం క్యారేజీలు ఎందుకొస్తాయని డైరక్ట్ గా ప్రశ్నించింది పూజా హెగ్డే. ఇటలీ షెడ్యూల్ లో పూజాహెగ్డే అసిస్టెంట్లు ముగ్గురు కరోనా బారిన పడ్డారట. ఆ టైమ్ లో భోజనం కోసం పూజా హెగ్డే చాలా ఇబ్బంది పడిందట. అప్పుడు ప్రభాసే తన అసిస్టెంట్ల సహాయంతో పూజాహెగ్డేకు 2 పూటలు సౌతిండియా భోజనాన్ని పంపించాడని గుర్తు చేసుకుంది.

అంతేకాకుండా ఇటిలీ నుంచి ఇండియా వచ్చిన తర్వాత కూడా పూజాహెగ్డేను చూసుకున్నారు ప్రభాస్. నవరాత్రుల సందర్భంగా పూజాహెగ్డే శాకాహారం మాత్రమే తినాల్సి వచ్చిన  టైమ్ లో బయటకెళ్లి తింటే వ్రతభంగం అవుతుందని భావించి, ప్రభాసే దగ్గరుండి రకరకాల వెజ్ వంటకాల్ని క్యారేజీలతో పంపించాడని అంది.  ఇలా తనను ఎంతో బాగా చూసుకున్నాడని, నిజంగా గొడవలు జరిగితే ప్రభాస్ తనను అంతా బాగా చూసుకుంటాడా అని ప్రశ్నిస్తోంది పూజాహెగ్డే. మీడియా వచ్చిన ఆ వార్తల్ని చూసి నవ్వుకుంటానని అంటోంది. మొత్తానికి జనాలని ,మీడియాని వెర్రి వెధవలను చేసింది అని చెప్పుకుంటున్నారు. 

click me!