మేకింగ్ పరంగా సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. కాకపోతే ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్న నితిన్ బెటర్ మెంట్స్ కోసం ట్రై చేద్దామని అన్నారట. అప్పటికి స్క్రిప్టులో షూటింగ్ టైమ్ లో మార్పులు చేసారట. అవేమీ అద్బుతంగా వర్కవుట్ కాలేదట.
నితిన్ కెరీర్ పరంగా సీనియర్ హీరోనే. చాలా చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి రావటం, తన తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో,ప్రొడక్షన్ లో ఉండటంతో సినిమా ని అంచనా వేయగలగటం ఈజీనే. అయితే మొదట డైరక్టర్స్ చెప్పే కథలకు ఆ తర్వాత షూటింగ్ పూర్తయ్యాక అవుట్ ఫుట్ చూసుకుంటే చాలా సార్లు తేడా అనిపిస్తుంది. అయితే ఒక్కోసారి మ్యాజిక్ జరిగిపోతుంది. కొన్ని ఎలిమెంట్స్ పట్టేసి వర్కవుట్ అయ్యిపోతాయి. అయితే నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ విషయంలో నితిన్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఈ చిత్రం లిమిట్ క్రాస్ చేసేసిందని టెన్షన్ పడుతున్నారట. ఈ సినిమాని నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌నే తెరకెక్కిస్తోంది. ముందు అనుకొన్న బడ్జెట్ కంటే 30 శాతం ఖర్చు పెరిగిపోయింది తెలుస్తోంది. దర్శకుడికి ఇదే తొలి సినిమా కావటం రీషూట్ లు బడ్జెట్ ని పెంచేసాయిట. అయితే మేకింగ్ పరంగా సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. కాకపోతే ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్న నితిన్ బెటర్ మెంట్స్ కోసం ట్రై చేద్దామని అన్నారట. అప్పటికి స్క్రిప్టులో షూటింగ్ టైమ్ లో మార్పులు చేసారట. అవేమీ అద్బుతంగా వర్కవుట్ కాలేదట.
కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయిన నితిన్ `మాచర్ల..`పై గట్టిగా నమ్మకాలు పెట్టుకొన్నాడు. సొంత బ్యానర్‌లో వస్తున్న సినిమా కాబట్టి.. ఇంకాస్త కేర్ చూపిస్తున్నాడంటున్నారు. దానికి తోడు చెక్, రంగ్ దే చిత్రాలు రెండు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటం తో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్స్. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 12న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.