Ravi Teja:అందుకే రవితేజ విషయంలో ఎవరూ తల దూర్చరు

By Surya PrakashFirst Published Jun 26, 2022, 8:47 AM IST
Highlights

 మిగతా హీరోల్లా తర్వాత చూసుకుందాం అనే ధోరణి ఆయనతో ఉండదు. క్యాష్ అండ్ క్యారీ అంటారు. అయితే ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఎవరైనా తమ డబ్బుని తాము వసూలు చేసుకోవాలనుకుంటారు. అందుకే రవితేజ విషయంలో పరిశ్రమ పెద్దలు ఎప్పుడూ తప్పు పట్టలేదు. 


రెమ్యునరేషన్ విషయంలో చాలా పట్టుగా ఉండే రవితేజ ఓ మెట్టుదిగారు. తన  తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కోసం రెమ్యునషన్ సెటిల్మెంట్ చేసుకుని రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రమోషన్స్ కు కూడా సిద్దపడుతున్నారు. దాంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారని సమాచారం. అయితే రవితేజ ను ఒప్పించటానికి దర్శక,నిర్మాతలు చాలా కష్టపడ్డారని సమాచారం. సినిమా షూటింగ్ ,మిగతా విషయాల్లో చాలా కంఫర్ట్ గా ఉండే రవితేజ..రెమ్యునరేషన్ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. సినిమా పూర్తయ్యేలోగా తన పేమెంట్ క్లియర్ చేయాలని నిర్మాతకు చెప్పేస్తారు. తేడా వస్తే డబ్బింగ్ చెప్పరు. 

పెండింగ్ లో ప్యాచ్ వర్క్ లు కూడా అలాగే ఉంచేస్తారు. ఈ విషయం తెలిసిన వారు  రవితేజతో జాగ్రత్తగా ఉంటారు. మిగతా హీరోల్లా తర్వాత చూసుకుందాం అనే ధోరణి ఆయనతో ఉండదు. క్యాష్ అండ్ క్యారీ అంటారు. అయితే ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఎవరైనా తమ డబ్బుని తాము వసూలు చేసుకోవాలనుకుంటారు. అందుకే రవితేజ విషయంలో పరిశ్రమ పెద్దలు ఎప్పుడూ తప్పు పట్టలేదు. ముందే రెమ్యునరేషన్ మాట్లాడుకునేటప్పడే అవసరం అనుకుంటే బేరం ఆడుకోవాలి తప్పించి చివరి నిముషాల్లో సర్దుబాటు కాలేదు..రిలీజ్ అయ్యాక, లేదా బిజినెస్ అయ్యాక క్లియర్ చేద్దాం అంటే కష్టమే అంటారు. ఏదైతేనేం రామారావు ఆన్ డ్యూటికు క్లియరెన్స్ వచ్చినట్లైంది.

రవితేజ(Raviteja)హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao On Duty). సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. దివ్యాంశ కౌశిక్‌(Divyansha Kaushik), రజిషా విజయన్‌ హీరోయిన్స్ . వేణు తొట్టెంపూడి, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర  టీమ్  అధికారికంగా ప్రకటించింది.  ‘‘యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రవితేజ శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.
 

click me!