Sarkaru Vaari Paata: `స‌ర్కారు వారి పాట‌` స్పెషల్ సబ్ టైటిల్స్.. అసలు రీజన్ ఇదే

By Surya Prakash  |  First Published May 11, 2022, 11:15 AM IST

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలలో మహేష్, డైరెక్టర్ మాట్లాడిన విధానంతో సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.   



 సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రేపు అంటే మే 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసిందుకు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై సూప‌ర్ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

మ‌హేశ్‌కు టాలీవుడ్‌తో పాటు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే.ప్ర‌ధానంగా త‌మిళనాడు, క‌ర్ణాట‌క‌లో మ‌హేశ్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వారు మ‌హేశ్ తాజా చిత్ర‌మైన స‌ర్కారు వారి పాట చూడాల‌ని ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, త‌మ భాష‌లో కూడా సినిమాను విడుద‌లంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా రిక్వ‌ెస్ట్ చేస్తున్నారు. క‌నీసం ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్ తో అయినా సినిమాను అందించాల‌ని కోరుతున్నారు. దీంతో మేక‌ర్స్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

Latest Videos

 స‌ర్కారు వారి పాట తెలుగు వ‌ర్ష‌న్‌కు ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్ తో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ దిశ‌గా ప‌నులు కూడా జ‌రుగుతున్నాయ‌ని సమాచాచరం. ఇటీవ‌ల కాలంలో చాలా మంది ప్రేక్షకులు సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను చూసేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుండ‌టం వ‌ల్లే , డబ్బింగ్ చేయకుండా మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. 

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలలో మహేష్, డైరెక్టర్ మాట్లాడిన విధానంతో సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.  ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను డబుల్ చేశాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా సక్సెస్ కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

click me!