#KoratalaSiva: కొరటాలకు కన్నీళ్లు..., ఆ హీరో ఫ్యాన్స్ సపోర్ట్?

By Surya Prakash  |  First Published Oct 2, 2022, 3:18 PM IST

 రిలీజ్ ఇయ్యి ఇంతకాలం అయినా ఆయన ఆ సినిమాకు సంబందించిన నిందలను ఇంకా కొరటాల శివ మీద వేస్తూనే ఉన్నారు.  ఆచార్య విజయం సాధించకపోయినా చిరు అప్పుడు  ఏ మాత్రం విచారం వ్యక్తం చేయలేదు.  



చిరంజీవి గత చిత్రం  ఆచార్య డిజార్టరైన మాట నిజమే. కోవిడ్ తర్వాత మారిన  ప్రేక్షకుల ఆలోచనలు పసిగట్టలేక,  అంచనాలు అందుకోలేకపోయింది. అయితే సినిమా ఫెయిల్యూర్ చిరంజీవి మాత్రం బాగా బాధించింది. ఆ విషయం ఆయన కామెంట్స్ తో తెలుస్తోంది. రిలీజ్ ఇయ్యి ఇంతకాలం అయినా ఆయన ఆ సినిమాకు సంబందించిన నిందలను ఇంకా కొరటాల శివ మీద వేస్తూనే ఉన్నారు.  ఆచార్య విజయం సాధించకపోయినా చిరు అప్పుడు  ఏ మాత్రం విచారం వ్యక్తం చేయలేదు.  కానీ తర్వాత మెల్లిగా ఈ సినిమా పై సెటైర్స్ వేస్తూ వస్తున్నారు. తాజాగా తన గాడ్ ఫాధర్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ...మరోసారి ఆ సినిమా ప్రస్తావన తెచ్చారు.

‘‘కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు ఆనంద ప‌డేవాడిని.. ఫ్లాప్ వ‌చ్చిన‌ప్పుడు బాధ‌ప‌డేవాడిని. అవి అప్ప‌టి రోజులు. ఈ జ‌ర్నీలో చాలా నేర్చుకున్నాను. మాన‌సికంగా, శారీర‌కంగా త‌ట్టుకోవ‌టం తెలుసుకున్నాను. ఎప్పుడైతే యాక్ట‌ర్‌గా ఓ ప‌రిణితి సాధించానో అప్పుడు స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్ గురించి పెద్ద‌గా ఆలోచించ‌టం మానేశాను. ఆచార్య విష‌యానికి వ‌స్తే ఆ సినిమా ఫ్లాప్ న‌న్ను బాధించ‌లేదు. ఎందుకంటే ద‌ర్శ‌కుడు చెప్పింది చేశాం. అయితే బాధ‌ప‌డ్డ విష‌య‌మేమంటే నేను, చ‌ర‌ణ్ (Ram Charan) క‌లిసి తొలిసారి న‌టించాం. ఆ సినిమా ప‌రాజ‌యం బాధించింది. త‌ర్వాత మేం క‌లిసి న‌టించిన ఆ జోష్ ఉండ‌క‌పోవ‌చ్చు’’ అని అన్నారు చిరంజీవి. ఈ కామెంట్స్ ఖచ్చితంగా కొరటాల శివను బాధించేవే. డైరక్ట్ గాకొరటాల శివను ఆయన టార్గెట్ చేసినట్లైంది. చిరంజీవి వంటి సీనియర్ హీరో ..దర్శకుడు ప్రస్తావన తెచ్చి దెప్పి పొడవకుండా ఉండాల్సింది అంటున్నారు. 

Latest Videos

ఈ నేపధ్యంలో  ‘ఆచార్య‌’ ఫ్లాప్‌పై (Acharya Disaster) చిరంజీవి రెస్పాండ్ అయిన  తీరుని ఓ వర్గం వారు తప్పుపడుతున్నారు.  ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను కాద‌ని.. కొర‌టాల శివ (Koratala Siva) సినిమా డైరెక్ట్ చేస్తారా! ఫ్లాప్ వ‌స్తే దానికి అత‌న్నే పూర్తి బాధ్యుడ్ని చేయ‌టం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొరటాల శివకు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ వస్తోంది. గతంలో మహేష్ బాబుకు శ్రీమంతుడు, భరత్ అనే నేను, ప్రభాస్ తో మిర్చి, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నారు కొరటాల శివ. సోషల్ మీడియాలో ఈ హీరో అభిమానులు కొరటాలకు సపోర్ట్ గా పోస్ట్ లు పెడుతున్నారు. ఇదో రకం స్టార్ వార్ అని చెప్పాలి.

click me!