ముందు సాయి పల్లవి ఈ పాత్రలో నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ చివరకు మేకర్స్ కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకున్నారు.
కీర్తి సురేష్ మహానటి సక్సెస్ తర్వాత ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట చేస్తున్న ఆమె తన తదుపరి చిత్రానికి సైన్ చేసింది. చిరంజీవి,మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో ఆమె చెల్లిలు పాత్ర చేయటానికి సరే అంది. చాలా కాలంగా ఆమె చేస్తుందా చేయదా అనే టాపిక్ నడిచింది. మొదట కీర్తి సురేష్ చెల్లి పాత్ర అనేసరికి వెనకడుగు వేసినా చిరంజీవి సినిమా కావటం, మంచి రెమ్యునేషన్ ఆఫర్ చేయటంతో ఓకే చెప్పేసింది. ఆ తర్వాత ఆమె రామ్ చరణ్ సినిమా కూడా చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభం కానుంది. మొదట ఈ పాత్రకు సాయి పల్లవి ని అనుకున్నారు. కానీ ఆమె వరస సినిమాలతో బిజీగా ఉండటంతో కీర్తి సురేష్ సీన్ లోకి వచ్చింది. భారీ రెమ్యునేషన్ తో ఆమెను ప్రాజెక్టులోకి తీసుకువచ్చారని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చి విజయవంతమైన రీమేక్ వేదాళం సినిమా రీమేక్. మెగాస్టార్ సూచనలు సలహాలతో తెలుగు నేటివిటికి తగ్గ మార్పులు చేసారు. ఈ రీమేక్ ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ క్రమంలో ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా నటించే హీరోయిన్ ని ఫైనలైజ్ చేసారు.
ఇక వేదాళం సినిమాలో చెల్లెలు క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది. ఆ క్యారక్టరే సినిమాను మలుపు తిప్పుతుంది. హీరోకు సరిసమానంగా సాగే క్యారక్టర్ అది. దాంతో ఈ రీమేక్ అనుకున్న రోజు నుంచీ ఆ పాత్రలో ఎవరు నటించనున్నారని విషయం పై ఆసక్తికర చర్చ మొదలైంది. కీర్తి సురేష్ అయితేనే మెగాస్టార్ సిస్టర్ రోల్‌కి బాగుంటుందని భావించిన మెహర్ రమేష్..ఆమె చేత ఓకే చేయించేందుకే ఎక్కువ కష్టపడ్డారని చెప్పుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రటాల శివ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మలయాళ రీమేక్ లూసిఫర్ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్రను కూడా క్రియేట్ చేసారట. ఒరిజినల్ లో అసలు హీరోయిన్ పాత్ర ఉండదు.