ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయట. పిభ్రవరి 2024లో ఈ కొత్త ఇంటి గృహ ప్రవేశం జరగనుందని తెలుస్తోంది.
బాలయ్య కు తనకంటూ కొన్ని నమ్మకాలు ఉంటాయని ఆయనతో జర్ని చేసినవాళ్లు చెప్తూంటారు.అలాగే ప్రతీది తిథి,వార నక్షిత్రములు చూసుకుని ముందుకు వెళ్తూంటారనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఇప్పుడు ఇల్లు కొత్త ఇల్లు మారబోతున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ లో చిరంజీవి ఉంటున్న ఇంటికి దగ్గరలో ఈ కొత్త ఇల్లు ఉండబోతోంది. ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయట. పిభ్రవరి 2024లో ఈ కొత్త ఇంటి గృహ ప్రవేశం జరగనుందని తెలుస్తోంది. హఠాత్తుగా ఆయన ఇల్లు మారటం వెనక కారణం వాస్తే అయ్యిండవచ్చు అంటున్నారు.
ఇక ప్రస్తుతం బాలయ్య చిత్రాల విషయానికి వస్తే..అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా రూ.100 కోట్లు వసూలు చేసిన హ్యాట్రిక్ చిత్రాల కథానాయకుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుస విజయాలతో ఆయన దూసుకుపోతున్నారు. ఆయనతో సినిమా చేసిన నిర్మాతలు లాభాలబాటలో ఉంటున్నారు. అందుకే వరస ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్‍బాస్టర్ దిశగా ముందుకు వెళుతోంది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో మంచి కలెక్షన్లను సాధిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన శైలికి భిన్నంగా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భగవంత్ కేసరి చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రానికి వసూళ్ల జోరు కూడా కొనసాగుతోంది.