'ధమాకా' కథ మెగా హీరో రిజెక్ట్ చేసాకే ...రవితేజ ఓకే చెప్పాడా?

By Surya Prakash  |  First Published Dec 26, 2022, 9:08 AM IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతూ భారీ స్థాయి వసూళ్లని రాబడుతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.



సినీ పరిశ్రమలో ఓ మాట నమ్ముతూంటారు. ప్రతీ కథ తనకు తగ్గ హీరోను తనే ఎంచుకుంటుందని. అందుకే ఎంత మంది హీరోలు నో చెప్పినా నిరాశపడకుండా కథను పట్టుకుని ముందుకు వెళ్తూంటారు దర్శకులు, రచయితలు. అలా ఒక హీరో కాదన్న కథను మరొకరు చేయటం జరుగుతూంటుంది.  అలా ఒకరు కాదన్న సినిమాలు మరో హీరో హిట్ కొడుతూంటారు. సదరు రిజెక్ట్ చేసిన హీరోలు నాలుక కరుచుకుంటూంటారు. తాజాగా థమాకా సినిమా గురించి కూడా అలాంటి వార్త ఒకటి వినపడుతోంది. 

ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ కథను మొదట ..రామ్ చరణ్ హీరోగా రాసుకుని వినిపించారని, అయితే ఈ కథలో లాజిక్స్ లేవని నో చెప్పాడని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో  రామ్ చరణ్ కోసమే ..ఇంద్ర స్పూఫ్ పెట్టారని చెప్తున్నారు. రౌడీ అల్లుడు కథ కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ ఓకే చేస్తాడని అనుకున్నారని, కానీ చరణ్ ఆ కథను ఇష్టపడలేదని అంటున్నారు. అలా ఆచి,తూచి అడుగులు వేస్తున్నాడు కాబట్టే... చరణ్ పాన్ ఇండియా స్దాయికి వెళ్ళాడని ఫ్యాన్స్ అంటున్నారు.

Latest Videos

భాక్సాఫీస్ దగ్గర   థమాకా సినిమా మంచి హిట్ అని వినపడుతోంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లని రాబడుతోంది. ఫస్ట్ డే ఊహించని విధంగా అదిరిపోయే ఓపెనింగ్స్ ని రాబట్టిన ఈ మూవీ వీకెండ్ లోనూ అదే స్థాయి జోరుని చూపించి షాక్ ఇచ్చింది. రవితేజ  చేసే మాస్ డైలాగులు .. ఫైట్లు .. డాన్సులు కరెక్టుగా కుదిరిన ప్రతి సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీవసూళ్లను నమోదు చేసింది. అలాగే ఈసారి కూడా మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న కథతో 'ధమాకా' సినిమా చేశాడు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా,  మొన్న శుక్రవారం థియేటర్లకు వచ్చింది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ను పక్కన పెట్టేసి చూస్తే, రవితేజ తన నుంచి తన ఫ్యాన్స్ ఆశించే సందడి చేశాడు. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. భీమ్స్ మాస్ బీట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 10 కోట్లకి పైగా రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.  ఈ రోజు నుంచి అసలు పరీక్ష ఎదురుకానుంది. దగ్గరలో పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేం లేకపోవడం 'ధమాకా'కి మరింత కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి.
 

click me!