KGF-2 : రామ్ చరణ్, బన్నిల కన్నా ఎన్టీఆర్ తెలివైనోడు అని ప్రూవైందా?

By Surya Prakash  |  First Published Apr 16, 2022, 6:50 PM IST

 'కేజీఎఫ్ 2' ఎట్టకేలకు గురువారం (ఏప్రిల్ 14) విడుదలైంది. కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది.



కేజీయఫ్ 2కు వచ్చిన క్రేజ్, ఈ సినిమా బద్దలు కొడుతున్న కలెక్షన్స్ గురించి విన్న తర్వాత  అందరి హీరోల దృష్టీ ప్రశాంత్ నీల్ పై పడింది. మీడియా,సోషల్ మీడియా,సినిమా జనం వాళ్లూ వీళ్ళూ అనే తేడా లేకుండా ఈ సినిమా గురించ మాట్లాడుతున్నారు. స్టార్స్ అయితే ఆయన నెంబర్ కనుక్కుని మరీ ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నట్లు వినికిడి. తామూ ఆయనతో సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఆల్రెడీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్...ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ...ఈ లోగా కేజీఎఫ్ 3 ప్లాన్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సైతం ప్రశాంత్ నీల్ సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. అయితే కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత మాట్లాడటం..రిజల్ట్ చూసాక ఆయనతో ఎగ్రిమెంట్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. అయితే వాళ్లందరికన్నా ఎన్టీఆర్ చాలా ఫాస్ట్ గా, తెలివిగా ఉన్నట్లు చెప్తున్నారు. కేజీఎఫ్ 2, సలార్ రిజల్ట్ లు చూడకుండా డైరక్ట్ గా ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు ఎప్రోచ్ అయ్యి ఎగ్రిమెంట్ చేసుకున్నాడంటున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 హిట్ ఖచ్చితంగా సలార్ కు ఓ రేంజిలో క్రేజ్ తెస్తుంది. సలార్ సైతం ఇలాగే సక్సెస్ అయితే ఎన్టీఆర్ సినిమాని వచ్చే క్రేజ్ ఆకాశమే హద్దుగా ఉంటుందనటంలో సందేహం లేదు. అసలు అప్పుడు ప్రశాంత్ నీల్ డేట్స్ పట్టుకోవటం చాలా కష్టమైన వ్యవహారం గా మారుతుంది.

Latest Videos

కేజీఎఫ్ , బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు ఒక క్రేజ్ కనిపిస్తే, పాన్ ఇండియా సీక్వెల్స్ కు నెక్ట్స్ లెవల్లో క్రేజ్ కనిపిస్తోంది. అది బాహుబలి 2తో ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు రాఖీభాయ్ రూలింగ్ తో మరోసారి పాన్ ఇండియా సీక్వెల్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధమైంది. దాంతో ఖచ్చితంగా కేజీఎఫ్ 3 వస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డార్లింగ్‌ ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్‌' రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం ఓ కొలిక్కి వచ్చిన తరవాత 'కేజీఎఫ్' పార్ట్ 3 పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.

click me!