ఫ్యామిలీ మ్యాన్-2లో కేరెక్టర్ లో ఇన్ వాల్వ్ అయిపోయి.. అసలు తానో హీరోయిన్ అన్న సంగతే మర్చిపోయేలా చేసింది. వివాదాలు ప్రక్కన పెడితే ఈ సిరీస్ రిలీజైన దగ్గర నుంచి సమంతకు ప్రశంసలే ప్రశంసలు. అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది సమంత అక్కినేని. ఇందులో రాజీ అనే తమిళ ఈలం సోల్జర్ గా ఆమె కనబర్చిన నటనకు సినీ ప్రియులతోపాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఓరకంటి చూపులకు బదులు..కరకు చూపులు.. సీరియస్ ఎక్స్ ప్రెషన్..నిజంగా సమంత చంపేసింది అన్నారు ఆ సీరిస్ చూసినవారంతా.
Family Man 2 కేరెక్టర్ లో ఇన్ వాల్వ్ అయిపోయి.. అసలు తానో హీరోయిన్ అన్న సంగతే మర్చిపోయేలా చేసింది. వివాదాలు ప్రక్కన పెడితే ఈ సిరీస్ రిలీజైన దగ్గర నుంచి సమంతకు ప్రశంసలే ప్రశంసలు. అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు Samantha పర్శనల్ లైఫ్ సరిగ్గా లేదు. దాంతో ఆమె పూర్తిగా తన ఏక్టింగ్ కెరీర్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా మరో వెబ్ సీరిస్ కు ఓకే చెప్పిందని సమాచారం.
గతంలో ఆమె ఆహాకు ఓ టాక్ షో చేసింది. అలాగే ఇప్పుడు ఆమె అదే ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఓ వెబ్ సీరిస్ కు చేయబోతోందిట. ఇందుకోసం కళ్లు తిరిగే రెమ్యునేషన్ ఆఫర్ చేసారట. అటు బాలయ్య టాక్ షో, ఇటు సమంత వెబ్ సీరిస్ తమ సంస్దని ఎక్కడికో తీసుకెళ్లాలని భావిస్తున్నారట. Balakrishnaతో ఇప్పటికే టాక్ షో ని ఎనౌస్స్ చేసింది ఆహా.
వాస్తవానికి ఫ్యామిలీ మ్యాన్ 2 తో సమంత క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో వెబ్ సిరీస్ ఆఫర్లు సమంతాకు ఫుల్లుగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ కు సైతం భారీ వెబ్ సిరీస్ కు ప్లాన్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలో గా ఆహా ఆమెతో ముందుకు వెళ్దామనుకుంటోందిట. ఇందుకోసం సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఆహా టీమ్ సమంతతో చర్చలు జరిపిందని.. ఈ వెబ్ సిరీస్ చేయడానికి సమంత కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్ అన్ని కుదిరితే ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నట్లుగా తెలుస్తోంది.