‘అన్‌స్టాపబుల్’ షో తరవాత అల్లు ఫ్యామిలీకి బాలకృష్ణ మరింత దగ్గరైనట్టు అందరికీ అనిపిస్తోంది. ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో మరింత చర్చనీయాంశమైంది.
బాలయ్య మంచి జోష్ మీద ఉన్నారు. ఓ ప్రక్కన సినిమాలు,మరో ప్రక్క ఆహా ఓటీటీలో వచ్చే అన్ స్టాపబుల్ షో, కమర్షియల్ యాడ్స్ తో కూడా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుని దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో చాలా రికార్డులను తిరగ రాసింది. ఈ షోలో బాలకృష్ణ చాలా కొత్తగా కనిపించటమే కాకుండా, ఆయన ఎంత సరదాగా ఉంటారనేది ఈ షో ద్వారా ప్రూవ్ అయ్యింది. ఈ షోతో ఏర్పడ్డ బంధంతో అల్లు, నందమూరి కాంబోలో సినిమా ప్లానింగ్ జరుగుతోందని టాక్.
‘అన్‌స్టాపబుల్’ షో తరవాత అల్లు ఫ్యామిలీకి బాలకృష్ణ మరింత దగ్గరైనట్టు అందరికీ అనిపిస్తోంది. ఇప్పుడు ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో మరింత చర్చనీయాంశమైంది. సాధారణంగా వేరే సినిమా ఫంక్షన్లకు పెద్దగా వెళ్లని బాలకృష్ణ.. అల్లు అరవింద్ కొడుకు సినిమా ఫంక్షన్‌కు వెళ్లారంటే వారి బంధం ఎంత బలపడిందో అర్థమవుతోంది.ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నందమూరి బాలకృష్ణ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయ్యిందనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి బాలయ్యను డీల్ చేసే డైరక్టర్ ఎవరు..ఎవరితో గీతా ఆర్ట్స్ ముందుకు వెళ్లబోతోంది అంటే...
గీతా ఆర్ట్స్ లో గీతా గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరుశురామ్ అని తెలుస్తోంది. సర్కారు వారి పాట తర్వాత పరుశురామ్ తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో ప్లాన్ చేసారు. ఆ సినిమా తర్వాత ఈ కాంబో ఉండే అవకాసం ఉందంటున్నారు. ఓ పవర్ఫుల్ ఓ స్టోరీ లైన్ ని బాలయ్య కోసం లాక్ చేశారట నిర్మాత అల్లు అరవింద్. త్వరలోనే బాలయ్యకు నేరేషన్ ఇవ్వబోతున్నారని, ఆయన ఓకే చెప్తే ముందుకు వెళ్తారని అంటున్నారు. అందుకు గాను పరుశురామ్ కి.. అరవింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. డిఫరెంట్ పాయింట్ తో సాగే ఈ కథ పోలీస్ ఆఫీసర్ పాత్ర చుట్టూ తిరుగుతుందని అని సమాచారం. అన్ని సెట్ అయితే వచ్చే సంక్రాంతికి అనౌన్స్‌మెంట్ రానుంది.
అఖండ ఘన విజయం తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వీరసింహా రెడ్డి టైటిల్ తో బాలయ్య ఫ్యాక్షన్ కథ చేస్తున్నారు. బాలకృష్ణకు శ్రుతీ హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, కన్నడ నటుడు దునియా విజయ్ (Duniya Vijay) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ (Thaman)సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ మూవీకి గాడ్ ఆఫ్ మాసెస్ అనే క్యాప్షన్‌ను పెట్టారు. ఈ క్యాప్షన్‌కు తగ్గట్టే బాలయ్య ఊర మాస్ మాస్ లుక్‌తో కనపడుతున్నారు. కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకున్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ కథను సిద్ధం చేశారని చెప్తున్నారు.