#Balakrishna : చిరు,బాలయ్య ఫ్యాన్స్ మధ్య అగ్గి పెట్టేందుకే ఇది పుట్టించారా,నిజంగా జరిగిందా

By Surya Prakash  |  First Published Oct 29, 2022, 7:19 AM IST

 ఎందుకంటే ఇద్దరూ సంక్రాంతికే వస్తాం అన్న తర్వాత ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గినా.. అభిమానులు, ట్రోలర్స్‌ ఊరుకోరు. కాబట్టి  ఎవరికి వాళ్లే తమ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ప్లాన్స్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఓ న్యూస్ వైరల్ అయ్యింది.


 రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య కొన్నేళ్లుగా పోటీ కొనసాగుతూనే వస్తోంది. భాక్సాఫీస్ దగ్గరర ఒక సారి మెగాస్టార్ మూవీ హిట్ కొడితే మరో సారీ బాలయ్య ప్రతాపం చూపించేవారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో వీరిద్దరి చిత్రాలు క్లాష్ కాలేదు. ఆ తర్వాత మదమూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు తల పడ్డాయి. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నంబర్ 150, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా చిత్రాలు వోచాయి. రెండూ హిట్ సాధించాయి.

మళ్లీ ఇప్పుడు మరోసారి పోటీ షురూ అయ్యింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’పైనే అందరి చూపూ ఉంది. దీంతో సంక్రాంతి బరి వేడెక్కింది. అంతేకాదు రెండు సినిమాల టీమ్ లలోనూ వేడి పెరిగిందట. ఎందుకంటే ఇద్దరూ సంక్రాంతికే వస్తాం అన్న తర్వాత ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గినా.. అభిమానులు, ట్రోలర్స్‌ ఊరుకోరు. కాబట్టి  ఎవరికి వాళ్లే తమ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ప్లాన్స్ లో ఉన్నారు.అది ప్రక్కన పెడితే తాజాగా ఈ ఇద్దరి హీరోల  ప్రాజెక్టుకు విషయం ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. అదేమిటంటే..
  
 తాజాగా బాలయ్య ఓ టాలీవుడ్ యంగ్‌ దర్శకుడికి చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అతను మరెవరో కాదు...ఫిల్మ్ నగర్ వర్గాల వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ, ‘ఛలో’ ఫేం వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చినట్లు టాక్‌.  రీసెంట్ గా వెంకీ, బాలయ్యకు ఓ ఫ్యామిలీ స్టోరీని వినిపించాడట. బాలకృష్ణకు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడట. అయితే ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. ఓ డైరక్టర్ కథ వినటం..ఓకే చెప్పటం.కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...కాగా వెంకీ కుడుముల తన మూడో సినిమాను చిరుతో చేయాల్సి ఉంది. కానీ చిరుకు ఫైనల్‌ నెరేషన్‌ నచ్చకపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ కాన్సిల్‌ అయింది. అదే కథ బాలయ్యకు చెప్పి ఒప్పించారని అంటున్నారు.

Latest Videos

ఈ ప్రచారం గత రెండు రోజులుగా ఊపందుకుంది. అయితే తెలిసిన సమాచారం ప్రకారం..ప్రాజెక్టు ఇంకా ఫైనలైజ్ కాలేదని, కథ వినటం వరకూ నిజమే అంటున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫన్, చిన్న సెంటిమెంట్ తో నడిచే ఈ చిత్రం బాలయ్య...కు నచ్చినా తన అభిమానులు, తన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఆయన డెసిషన్ తీసుకుంటారంటున్నారు. కాబట్టి ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు డౌట్ అని చెప్పాలి. 

 ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహా రెడ్డి అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు బాలయ్య ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా  కన్నడ స్టార్ దునియా విజయ్  విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

click me!