F3:షాకింగ్ గా 'ఎఫ్ 3' అడ్వాన్స్ బుక్కింగ్ ,సమ్మర్ సోగ్గాళ్లకు క్రేజ్ చాలలేదా?

By Surya Prakash  |  First Published May 26, 2022, 11:44 AM IST

చాలా థియేట‌ర్ల‌లో స‌గం టికెట్లు కూడా అమ్ముడ‌వ‌లేకపోవటం విశేషంగా చెప్పుకుంటున్నారు. సినిమా రిలీజ్‌కి ఇంకో 24 గంట‌లు కూడా లేదు. అయినా స‌రే, ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌లేక‌పోవ‌డం ఏమిటనేది ట్రేడ్ లో చర్చగా మారింది.



వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను,   రేపు అంటే ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాపై అందరూ మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే  అడ్వాన్స్ బుకింక్స్ లేవు. దాంతో డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో గుబులు మొద‌లైంది. పెద్ద సినిమా.. పైగా మ‌ల్టీస్టార‌ర్‌... దానికి తోడు హిట్ ఫ్రాంచైజీ. అయినా అనుకున్న స్దాయిలో క్రేజ్ రాకపోవటం ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీ కూడా షాకింగ్ గా చూస్తోంది. 
 
అలాగే   `సాధార‌ణ టికెట్ రేట్ల‌కే సినిమా` అంటూ మిడిల్ క్లాస్ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌వైపు ర‌ప్పించ‌డానికి దిల్ రాజు ఆల్రెడీ ప్రకటన చేసారు. అయినా స‌రే, ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. చాలా థియేట‌ర్ల‌లో స‌గం టికెట్లు కూడా అమ్ముడ‌వ‌లేకపోవటం విశేషంగా చెప్పుకుంటున్నారు. సినిమా రిలీజ్‌కి ఇంకో 24 గంట‌లు కూడా లేదు. అయినా స‌రే, ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌లేక‌పోవ‌డం ఏమిటనేది ట్రేడ్ లో చర్చగా మారింది.

అయితే  ఈ సినిమా మౌత్ టాక్ ని బ‌ట్టి... రెస్పాన్స్‌ని బ‌ట్టి, ప్రేక్ష‌కుల మ్యాట్నీ నుంచి పికప్ అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు.  రేపు మార్నింగ్ షో ప‌డ‌గానే.. టాక్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అది చూసైనా జ‌నాలు థియేట‌ర్ల‌కు రావాలని అంటున్నారు. మరో ప్రక్క ``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ సినిమా. కుటుంబ ప్రేక్ష‌కులే ఈ సినిమాకి బ‌లం. వాళ్లు మౌత్ టాక్ ని బ‌ట్టే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. శ‌ని, ఆదివారాల నుంచి... థియేట‌ర్లు నిండుతాయి`` అని లెక్కలు వేస్తున్నారు.

Latest Videos

ఇక ఇంతకుముందు 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' ఐటమ్ సాంగ్ లో పూజ మెరిసింది. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు మరోసారి ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి ఆమె అంగీకరించింది. 'ఎఫ్ 3' సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె సందడి చేయటం కలిసి వస్తుందని అంటున్నారు.

click me!