Dil Raju: భారీ సినీ స్టూడియో నిర్మాణంలో దిల్ రాజు, డిటేల్స్..

By Surya Prakash  |  First Published Jul 4, 2022, 7:25 PM IST

 తెలుగుతో పాటు  హిందీ,తమిళ, మళయాళ చిత్రాలు, అప్పుడప్పుడు హాలీవుడ్ చిత్రాలు సైతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎక్కడెక్కడి స్టార్స్ హైదరాబాద్ కు షూటింగ్ కోసం వస్తున్నారు. మరో ప్రక్క వెబ్ సీరిస్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. 



డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారి విజయం సాధించి ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. ఆయన అంచనాలు తప్పేవి తక్కువ శాతం. ఆయన సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం. ఈ నేపధ్యంలో ఆయన ప్యాన్ ఇండియా నిర్మాతగా మారారు. శంకర్,రామ్ చరణ్ కాంబో లో ఓ చిత్రం చేస్తున్నారు. అంతేకాదు త్వరలో ఓ భారీ సిని స్టూడియో ని నిర్మించటానికి సన్నాహాలు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.

హైదరాబాద్ ఇప్పటికే వరస సినిమా షూటింగ్ లతో ఫిల్మ్ హబ్ గా మారింది. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ కసిటీ...అతి పెద్ద సిని స్టూడియోగా అవతరించింది. తెలుగుతో పాటు  హిందీ,తమిళ, మళయాళ చిత్రాలు, అప్పుడప్పుడు హాలీవుడ్ చిత్రాలు సైతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎక్కడెక్కడి స్టార్స్ హైదరాబాద్ కు షూటింగ్ కోసం వస్తున్నారు. మరో ప్రక్క వెబ్ సీరిస్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. వీటితో పాటు టీవి సీరియల్స్. ఎక్కడ చూసినా షూటింగ్ లతో ప్రతీ స్టూడియో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సైతం ఓ చిన్న స్టూడియోని హైదరాబాద్ లో లాంచ్ చేసారు. చిరంజీవి ఇప్పుడు ఓ పెద్ద స్టూడియో ప్లానింగ్ లో ఉన్నారు.
 
ఈ ట్రెండ్ ని అనుసరిస్తూ దిల్ రాజు సైతం స్టూడియో నిర్మాణం చేయబోతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె హన్సిత రెడ్డి ఆలోచన ఇదని తెలుస్తోంది. హైదరాబాద్ లోని అతి పెద్ద స్టూడియోస్ లో ఒకటిగా తమది నిలవాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. శంషాబాద్ కు దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో దిల్ రాజుకు సొంత స్దలం ఉందని, అది ప్రైమ్ ల్యాండ్ అని అక్కడ స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. 
  
  ప్రస్తుతం దిల్ రాజు చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రామ్ చరణ్, శంకర్ మూవీతో పాటు.. విజయ్, వంశీ పైడిపల్లితో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు చిరంజీవి, బాలయ్యతో నెక్ట్స్ మూవీస్ చేయడానికీ ప్లాన్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!