దే సమయంలో చిరంజీవికి 2000 కోట్లు ఆదాయం కలిసి వచ్చిందంటూ టాక్ మీడియాలో మొదలైంది. అందులో నిజమెంత
ఓ ప్రక్కన అందరూ కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లకుపైగా పలికిన విషయం గురించి మాట్లాడుతున్నారు. హ్యాపీ రైట్స్ నియోపోలిస్, రాజ్‌పుష్ప ప్రాపర్టీస్ 3.6 ఎకరాలను రూ.362 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ విషయమే మీడియాలో హాట్ టాపిక్. అయితే అదే సమయంలో చిరంజీవికి 2000 కోట్లు ఆదాయం కలిసి వచ్చిందంటూ టాక్ మీడియాలో మొదలైంది. అందులో నిజమెంత అనేది ప్రక్కన పెట్టి ఆ వార్తలోకి వెళ్తే..
రామ్ చరణ్ ఉపాసన దంపతుల పెళ్లయి 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. కొద్దిరోజుల క్రీతమే పండంటి ఆడబిడ్డకు రామ్ చరణ్ దంపతులు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. తమ గారాల పార్టీకి క్లిం కారా అంటూ నామకరణం చేశారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుంది అంటారు. చిరంజీవి మనమరాలు క్లింకార రాకతో అదృష్టం గట్టిగానే కలిసి వచ్చిందని అనిపిస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఆయనకు రెండు వేల కోట్లు కలిసి వచ్చాయన అర్థమవుతుంది.
undefined
హెచ్ఎండిఏ కొత్తగా ఫ్లాట్లను విక్రయించగా ఒక ఎకరం ధర 100 కోట్లు పలికింది అది కోకాపేట్ లోనే. కోకాపేట్ లోని రియల్ ఎస్టేట్ లో ఇది సంచలనంగా మారింది ఒక ఎకరం ధర 100 కోట్లు పలకడంతో అందరూ నివ్వెర పోతున్నారు. అయితే మన మెగాస్టార్ చిరంజీవిది కూడా కోకాపేట్ లో ల్యాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆచార్య లాంటి సినిమాలకు సెట్లు కూడా వేశారు అఫీషియల్ గా లెక్కలు లేకపోయినా చిరంజీవికి 20 ఎకరాల పైనే కోకాపేట్ లో ల్యాండ్ ఉందని సమాచారం. దీనితో చిరంజీవికి ఇప్పుడు కోకాపేట్ లోని 2000 కోట్ల విలువ చేసే ఆస్తి అయ్యిందంటున్నారు. అయితే అది తక్కువ రేటుకు కొన్నారని ఇప్పుడు ఒక్కసారిగా దాని రేటు ఇంతలా పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వి ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా కీర్తి సురేష్ సుశాంత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. చిరంజీవి మరోవైపు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.