JGM:‘జనగణమన’ఆపేసారు సరే, ఆ ఇరవై కోట్ల పరిస్దితి ఏంటి?

By Surya PrakashFirst Published Sep 4, 2022, 10:17 AM IST
Highlights

ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. ఇప్పుడు పూర్తిగా నిలిపేసారు.అందుకు కారణంగా  ఇటీవలే విజయ్‌ - పూరిల కాంబినేషన్‌లో ‘లైగర్‌’ (Liger) చిత్రం డిజాస్టర్ అయ్యిన విషయం ప్రస్దావిస్తున్నారు. అయితే కారణం వేరే ఉందని తెలిస్తోంది.


పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’(Jana Gana Mana) అఫీషియల్ గా ఆగిపోయిన సంగతి తెలిసిందే.  అప్పట్లో మహేష్ తో చేద్దామనుకున్న ఈ చిత్రం రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే పూరి  ఈ సినిమాని కొన్నాళ్ల క్రితమే విజయ్‌ దేవరకొండతో (Vijay Deverakonda) పట్టాలెక్కించారు.  

'జనగణమన' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పుడు రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. వీరితో రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు 'లైగర్' సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసారనే వార్తలు వస్తున్నాయి.పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీనికి ఛార్మి కౌర్ - దర్శకుడు వంశీ పైడిపల్లి లను నిర్మాతలుగా పేర్కొన్నారు.

ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. ఇప్పుడు పూర్తిగా నిలిపేసారు.అందుకు కారణంగా  ఇటీవలే విజయ్‌ - పూరిల కాంబినేషన్‌లో ‘లైగర్‌’ (Liger) చిత్రం డిజాస్టర్ అయ్యిన విషయం ప్రస్దావిస్తున్నారు. అయితే కారణం వేరే ఉందని తెలిస్తోంది.

లైగర్ చిత్రం డిజాస్టర్ అవటంతో ఇప్పుడు బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్స్ తమకు సెటిల్మెంట్ చేయమని పూరిని అడుగుతున్నారు.  'లైగర్' సినిమాపై హైప్ దృష్ట్యా అన్ని ఏరియాలలో భారీ రేట్లకే విక్రయించారు. నైజాం రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పెద్ద మొత్తంలో నష్టపోయాడు. అలానే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ భారీగా నష్టాలు వచ్చాయి.  ఈ సమయంలో  ‘జనగణమన’ లాంటి భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తే...ఖచ్చితంగా ఆ సినిమా రైట్స్ ని  లైగర్ ద్వారా నష్టపోయిన వాళ్లందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయటానికి ఏ బయిట నిర్మాత ఒప్పుకోడు. 

'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ మరియు 'జనగణమన' నిర్మాతలు మై హోమ్ గ్రూప్ మధ్య బడ్జెట్  గురించి చర్చలు జరిగినట్లు, అందులో లైగర్ సెటిల్మెంట్ విషయం టాపిక్ వచ్చినట్లు  తెలుస్తోంది.  అలాగని ‘జనగణమన’ని పూరి స్వయంగా నిర్మించే స్దితిలో లేదు. ఈ పరిస్దితుల్లో  ముందుకు వెళ్తే మునిగిపోతామని, అంత శ్రేయస్కరం కాదని భావించిన పూరి జగన్నాథ్‌.. విజయ్‌తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

మేకర్స్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ కోసం 20 కోట్ల రూపాయలు వరకూ ఖర్చు చేసినట్లు టాక్ ఉంది. ఇప్పుడు దాని సెటిల్మెంట్ విషయం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.

పూరి ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారని, త్వరలో దానిపై అధికారిక ప్రకటన వెలువడనుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.  అలాగే  పూరీ జగన్నాథ్ 'లైగర్' సినిమా నష్టాలను భర్తీ చేసే ప్రయత్నాలు చేపట్టనున్నారని టాక్. ప్రస్తుతం ముంబైలో ఉన్న పూరీ.. ఈ వీకెండ్ లో తిరిగి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లను కలుసుకోనున్నారట. వారికి 30 శాతం నష్టపరిహారం చెల్లించాలని పూరీ భావిస్తున్నారట.

click me!