#NTR:ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ తో నష్టం అంతా? షాకింగ్ ఎమౌంట్

By Surya Prakash  |  First Published Sep 3, 2022, 8:31 AM IST

 ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీ వేదికగా బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రావాల్సి ఉంది. 


బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ హైదరాబాద్ లోనూ చేసారు. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి విడుదల చేస్తున్న కారణాన్న ఆయన కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. 

 ఈ నేపథ్యంలోనే వరుస రాష్ట్రాలను తిరుగుతున్న చిత్రటీమ్  నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్లు కూడా తెలిపింది. దీంతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పడింది.

Latest Videos

అయితే లాస్ట్ మినిట్ లో  ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యినట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నామని, అభిమానులను నిరాశ పరిచినాడుకు క్షమాపణలు కోరుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. 

ఇక లాస్ట్ మినిట్ లో ఇలా ఈవెంట్ కాన్సిల్ చేయటం వలన బ్రహ్మాస్త్ర టీమ్ కు 2.25 కోట్లు వరకూ నష్టం వచ్చినట్లు మీడియా వర్గాల ద్వారా వినిపిస్తోంది. అలాగే పార్క్ హయిత్ లో అప్పటికప్పుడు ఏర్పాటు చేయటంతో మరో పది లక్షలు దాకా ఖర్చు అయ్యినట్లు తెలుస్తోంది.

 ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా బాలీవుడ్ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

click me!