శ్రీలీల లేకపోతే ఆ హీరో డేట్స్ ఇవ్వడు.. రెట్టింపు ఇస్తే కానీ ఆమె చేయదు

By Surya Prakash  |  First Published Jul 18, 2023, 5:19 PM IST

  శ్రీలల వరసగా స్టార్‌ హీరోల సరసన సినిమాలు చేస్తోంది.  రామ్‌ పోతినేని-బోయపాటి, బాలకృష్ణ-అని రావిపూడి కాంబినేషన్లో రాబోయో చిత్రాల్లో చేస్తోంది. 


`ధమాకా` ఇచ్చిన సక్సెస్ తో దూసుకుపోతోంది కన్నడ బ్యూటీ శ్రీలీల. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని అమలు చేయటం మొదలెట్టింది. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఫిక్సైంది. ఈ క్రమంలో తన  రెమ్యునరేషన్ డబుల్ చేసిందని సమాచారం. ఇది నిర్మాతలును భయపెడుతోంది.

స్టార్ హీరోలు, డైరక్టర్స్ ..అందరూ శ్రీలీల కావాలని అడుగుతున్నారు. దాంతో హీరో గారి డేట్స్ కావాలంటే శ్రీలీల డేట్స్ కావాల్సిన పరిస్దితి ఏర్పడింది. అయితే ఈ విషయం గమనించిన శ్రీలల తాను డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని సదరు హీరోగారి సినిమా చేయాలంటే తను కోరిక రెమ్యునరేషన్ ఇవ్వాలని అంటోంది. వేరే దారిలేక సదరు నిర్మాత.. కన్నీళ్లు తుడుచుకుంటూ అడ్వాన్స్ ఇచ్చి ఆమె డేట్స్ తద్వారా హీరో గారి డేట్స్ లాక్ చేసుకున్నారు. ఈ సంఘటన రీసెంట్ గా ఓ తెలుగు నిర్మాత విషయంలో జరిగిందని వినికిడి.

Latest Videos

ఇంతకీ శ్రీలల ఎంత తీసుకుంటోంది అని ఎంక్వైరీ చేస్తే.. ప్రస్తుతం శ్రీ లీల కోటి పు రెమ్యునరేషన్ అందుకుంటుంది. తాజాగా మహేష్ సినిమాకు కోటి పైనే తీసుకుందని తెలుస్తుంది. ఇప్పుడు తన  రెమ్యునరేషన్ డబుల్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటోందని టాక్.  అయితే ఉన్నంతలో రిలీఫ్ ఏమిటి అంటే `ధమాకా` ముందు  కమిట్ అయిన సినిమాల వరకు ముందు మాట్లాడిన రెమ్యునరేషన్ కే చేయనుందట.

 టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీలల స్టార్‌ హీరోల సరసన సినిమాలు చేస్తోంది.  రామ్‌ పోతినేని-బోయపాటి, బాలకృష్ణ-అని రావిపూడి కాంబినేషన్లో  రెడీ అవుతున్న `భగవంత్` కేసరి చిత్రం, మహేష్ బాబు `గుంటూరు కారం` వంటి వరస చిత్రాల్లో చేస్తోంది. మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ సినిమాకు 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట.   రామ్  సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది.  ఆ తర్వాత `ధమాకా` వచ్చి హిట్ అవటంతో ఒక్కరిగా గేర్ మార్చేసింది. అదీ విషయం.
 

click me!