ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖరీదైన విడాకులు: టాప్ 10 జంటలు వీళ్ళే..

First Published | Oct 15, 2024, 11:10 PM IST

నటీనటులకు  సంబంధాల ఒడిదుడుకులు కొత్తేమీ కాదు. బాలీవుడ్‌లో సంబంధం, పెళ్లి, విడాకుల వార్తలు సర్వసాధారణం. బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన 10 విడాకుల జంటల గురించి ఇప్పుడు చూద్దాం. 

అమృతా సింగ్ - సైఫ్ అలీ ఖాన్

అమృతా సింగ్ - సైఫ్ అలీ ఖాన్ : బాలీవుడ్‌లో ఖరీదైన విడాకుల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు  ఈ జంట. 1991లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2004లో విడాకులు తీసుకున్నారు. సారా, ఇబ్రహీం వీరిద్దరి సంతానం. ఇక ఈ విడాకుల వల్ల సైఫ్ తన మొదటి భార్యకు..  5 కోట్లు, నెలకు లక్ష రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది.

కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్: 90ల నటి కరిష్మా 2003లో సంజయ్‌ని పెళ్లాడి 2016లో విడాకులు తీసుకుంది. సంజయ్ 14 కోట్లు ఆమెకు భరణంగా ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆమిర్ ఖాన్ - రీనా దత్తా

ఆమిర్ ఖాన్ - రీనా దత్తా: ఆమిర్ మొదటి భార్య రీనా. 1986 లో పెళ్లి జరిగింది. ఆతరువాత వారు  2002 లో విడాకులు తీసుకున్నారు. ఇక అమీర్ ఖాన్ . రీనాకు 50 కోట్ల  పరిహారం ఇచ్చారని సమాచారం. 

ఫరా ఖాన్ - అధున్ భవానీ: 3 ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెళ్లైన ఈ జంట 16 ఏళ్ల తర్వాత విడిపోయారు.


హృతిక్ - సుజానీ ఖాన్

హృతిక్ రోషన్ - సుజానీ ఖాన్: 2000 లో పెళ్లైన ఈ జంట 2013 లో విడిపోయారు. హృతిక్ 400 కోట్లభరణం సుజానీకి ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. 

ఆదిత్య చోప్రా - పాయల్ ఖన్నా: 2001లో పెళ్లైన ఈ జంట 2006 లో విడిపోయారు. ఆదిత్య 50 కోట్లు పరిహారం పాయల్ కు ఇచ్చాడని అంటారు. 

ప్రభుదేవా - రామలత

ప్రభుదేవా - రామలత: 2010 లో విడాకులు తీసుకున్న ఈ జంటలో ప్రభుదేవా తన భార్యకు 2 కార్లు, 2 ఇళ్ళు, 1 ఫ్లాట్, 10 లక్షలు ఇచ్చాడు. మొత్తం 20-25 కోట్ల విలువ చేసే ఆస్తిని ఆయన ఇచ్చినట్టు సమాచారం. నయనతారతో ప్రేమ వ్యవహారం ముందిరి ప్రభుదేవ రామలతకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

సోహెల్ ఖాన్ - సీమా ఖాన్: 1998 లో పెళ్లైన ఈ జంట 24 ఏళ్ల తర్వాత 2022 లో విడిపోయారు. జీవనాంశం ఎక్కువగానే ఇచ్చినట్టు వార్త.

సంజయ్ దత్ - రియా పిళ్లై

సంజయ్ దత్ - రియా పిళ్లై: 1998 లో పెళ్లైన ఈ జంట 2005 లో విడిపోయారు. సంజయ్ 8 కోట్ల విలువైన ఫ్లాట్, ఖరీదైన కారు రియాకు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్: 1998 లో పెళ్లైన ఈ జంట 2017 లో విడిపోయారు. అర్బాజ్ 10-15 కోట్ల పరిహారం మలైకాకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక 50 ఏళ్ళు దాటిని మలైకా.. యంగ్ హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!