తనను కాదన్నదని.. వధువు పెళ్లిలో ప్రేమికుడి హల్ చల్.. అందరూ చూస్తుండగానే ఆమెను పట్టుకుని...

First Published | Dec 10, 2021, 10:41 AM IST

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి జరుగుతున్న సమయంలో.. సరిగా వరుడు పూలమాలను పెళ్ళికూతురి మెడలో వేయడానికి వెడుతుండగా.. ఆమె లవర్ వేదికపైకి దూసుకొచ్చాడు. తనను గుర్తు పట్టకుండా మొహానికి మొత్తం కండువా చుట్టుకున్నాడు. అంతలోనే చేతిలోని సింధూరం ఆమె నుదుటి మీద రుద్దాడు. 

UP man puts sindoor on her maang in front of groom

అచ్చం సినీ ఫక్కీలో ఒక భగ్న ప్రేమికుడు తన ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా పెళ్లి పీటలు వద్దకు దూసుకొచ్చాడు. వరుడు వధువు మెడలో పూలమాల వేయగా ఆ సమయంలో ఆ ప్రియుడు పెళ్లి కూతురిని పట్టుకుని చేయకూడని పని చేశాడు. ఈ సంఘటనని ఆ వేడుకలో ఉన్నవారెవరో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

UP man puts sindoor on her maang in front of groom

ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి జరుగుతున్న సమయంలో.. సరిగా వరుడు పూలమాలను పెళ్ళికూతురి మెడలో వేయడానికి వెడుతుండగా.. ఆమె లవర్ వేదికపైకి దూసుకొచ్చాడు. చుట్టుపక్కల ఉన్నవారు కెమెరామెన్ ఏమో అనుకున్నారు. తనను గుర్తు పట్టకుండా మొహానికి మొత్తం కండువా చుట్టుకున్నాడు...


UP man puts sindoor on her maang in front of groom

అంతలోనే చేతిలోని సింధూరం ఆమె నుదుటి మీద రుద్దాడు. ఏం జరుగుతుందో వధూవరులతో పాటు అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు. ఆ తరువాత వారు తేరుకునే లోపే ఆ ఘాటు ప్రేమికుడు...మళ్లోసారి తన జేబులో నుంచి ఇంకాస్త సింధూరం తీసి  మళ్ళీ ఆమె తలపై బలవంతంగా రుద్దాడు. ఆ తరువాత ఆమెకు ఏదో హెచ్చరిస్తూ మాట్లాడాడు.. చేతి వేళ్లు చూపిస్తూ, బెదిరిస్తూ ఏదో చెప్పాడు.

UP man puts sindoor on her maang in front of groom

అప్పటికి తేరుకున్న బంధువులు, స్నేహితులు స్టేజి మీదనే అతన్ని పట్టుకున్న చితకబాదారు. అయితే ఇంత జరుగుతున్న సమయంలో పెళ్లికొడుకు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడే తప్పా ఏమీ చేయలేకపోయాడు. అంతలో ఆ ప్రేమికుడు తనను కొడుతున్న వారినుంచి తప్పించుకుని పారిపోయాడు.

UP man puts sindoor on her maang in front of groom

ఉత్తరభారతదేశంలో వధువు నుదుటిపై సింధూరం పెట్టడం అంటే.. ఆమె మెడలో తాళి కట్టినట్టే. వారికి పెళ్లి అయినట్టే భావిస్తారు. మరి ఈ ఘటనతో ఆ అమ్మాయి జీవితం ఏ మలుపు తిరగబోతోందో కాలమే నిర్ణయించాలి. 

Latest Videos

click me!