Train: ఇలా చేస్తే జనరల్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు!

Published : Jan 30, 2025, 02:34 PM IST

ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలు కల్పించింది. ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించింది. కానీ అనుకోకుండా, అర్జెంటుగా జర్నీ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటీ? జనరల్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ఎక్కితే ఏమవుతుంది?

PREV
14
Train: ఇలా చేస్తే జనరల్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు!

ఇండియన్ రైల్వే ప్రయాణీకుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా కన్ఫర్మ్డ్ టికెట్ పొందవచ్చు. కానీ ఒక్కోసారి మనం అర్జెంటుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడు టికెట్లు అందుబాటులో ఉండొచ్చు. ఉండకపోవచ్చు.

అప్పుడు జనరల్ టికెట్ తీసుకోని, రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ అందుకోసం ఈ పని చేయాల్సి ఉంటుంది.

24
ఖాళీ సీట్లను ఇలా గుర్తించండి

ముందుగా IRCTC యాప్ ఓపెన్ చేసి.. ఛార్ట్ వెయికెన్సీ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత ట్రైన్ నెంబర్, బోర్డింగ్, జర్నీ డేట్ లను ఎంటర్ చేయాలి. నెక్ట్స్ గెట్ డీటేల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు రైల్లో అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు కనబడతాయి. అప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి, ఖాళీగా ఉన్న సీట్లలో ఏదైనా సీట్ రిజర్వేషన్ చేయగలరో రైల్వే సిబ్బందిని అడగాలి. చేస్తే హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు.

34
జనరల్ టికెట్ తో..

రైల్వే సిబ్బంది ఒకవేళ టికెట్ బుక్ చేయడం కుదరదని చెప్తే.. జనరల్ టికెట్ తీసుకోవాలి. ట్రైన్ ఎక్కి ఖాళీగా ఉన్న సీటు దగ్గర కూర్చోవాలి. టీసీ వచ్చాక మన పరిస్థితి గురించి చెప్పి కాస్త రిక్వెస్ట్ చేయాలి. ఆ సీటుకి ఎంత అమౌంట్ పడుతుందో అది పే చేసి హ్యాపీగా జర్నీ చేసేయవచ్చు.

44
ఆటో అప్ గ్రేడ్..

రైలు ప్రయాణాన్ని మరింత మెరుగుపరచడానికి టికెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు "ఆటోమేటిక్ అప్‌గ్రేడ్‌" ను ఎంపిక చేసుకోవాలి. దీంతో అదనంగా డబ్బు ఖర్చు చేయకుండానే ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు. చార్ట్ ప్రిపరేషన్ ట్రైన్ స్టార్ట్ కావడానికి కొన్ని గంటల ముందు జరుగుతుంది కాబట్టి.. ఈ ట్రిక్ మంచి సీటు పొందే అవకాశాలను పెంచుతుంది.

click me!

Recommended Stories