వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !

Published : May 18, 2025, 10:46 AM IST

Top 10 Historical Places in India:  ఈ వీకెండ్​లో ఏదైనా టూర్​కి ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలని తెగ ఆలోచిస్తున్నారా? డో వర్రీ మన దేశంలోనే ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి.  మీకోసమే.. ఇండియాలో టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితాను అందిస్తున్నాం.  వీటిపై ఓ లుక్కేయండి.

PREV
111
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
భారత దేశంలోని చారిత్రక ప్రదేశాలు

భారతదేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. ఇవి మన దేశ సంస్క్రుతిని ప్రతిబింబిస్తున్నాయి. భవ్యమైన కోటల నుండి సంక్లిష్టమైన దేవాలయాల వరకు.. ఎంతో చారిత్రక, వారసత్వ సంపద ఉంది. భారతదేశంలోని అద్భుతమైన కట్టడాలు, ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

211
ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ - ఉత్తరప్రదేశ్: 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన కోట నగరం. ఈ ప్రదేశం మొఘల్ సామ్రాజ్యం తాత్కాలిక  రాజధానిగా పనిచేసింది.

311
మైసూర్ ప్యాలెస్ - కర్ణాటక:

మైసూర్ ప్యాలెస్  - కర్ణాటక: ఈ అద్భుతం హిందూ, ముస్లిం, రాజపుత్ర వాస్తుశిల్పానికి నిదర్శనం.  ఇది ఒకప్పుడు ఒడియర్ రాజవంశస్తుల రాజ నివాసం.

411
కోణార్క్ సూర్య దేవాలయం - ఒడిశా

కోణార్క్ సూర్య దేవాలయం - ఒడిశా: 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ 1 దీనిని నిర్మించారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది సూర్య దేవునికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది.

511
సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

సాంచి స్థూపం - మధ్యప్రదేశ్: మౌర్యుల పరిపాలన, వాస్తుశిల్పంకు నిదర్శనం. ​ఈ గొప్ప అద్భుతాన్ని చక్రవర్తి అశోకుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో బుద్ధుని అవశేషాలను ఉంచడానికి నిర్మించాడు. ఇది భారతదేశంలోని పురాతన రాతి కట్టడాల్లో ఒకటి.

611
హంపి రాతి రథం- కర్ణాటక:

హంపిలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన రాతి రథం ఇది.  విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రదర్శించే శిల్పకళ రూపమిది. 

711
హవా మహల్ - జైపూర్:

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉంది. ఈ మహల్ ను ఎరుపు, గులాబీ వర్ణపు ఇసుకరాళ్ళతో నిర్మించారు. ఇది పింక్ సిటీకి చిహ్నంగా చెబుతారు. దీన్ని 1799లో జైపూర్ మహారాజు ప్రతాప్ సింగ్ నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వారికి కనిపించకుండా నగరంలో జరుగుతున్న సంఘటనలు, రాజప్రాసాదపు ప్రదర్శనలను చూసేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.

811
చార్మినార్ - హైదరాబాద్

చార్మినార్‌ను 16వ శతాబ్దంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. చార్మినార్‌ను ఇండో- ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. నాలుగు మినార్లు, అందమైన కమాన్లు, ఇంటిలా నిర్మించిన అంతస్తులు దీనికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి మినార్‌పై ఒక చిన్న మసీదు ఉండటం విశేషం. ఈ స్మారక చిహ్నం హైదరాబాద్ స్థాపనను సూచించే నాలుగు గొప్ప తోరణాలను కలిగి ఉంది. 

911
గేట్‌వే ఆఫ్ ఇండియా - ముంబై:

గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది స్మారక చిహ్నం. దీనిని 1924లో కింగ్ జార్జ్ V సందర్శన జ్ఞాపకార్థంగా ఈ తోరణం నిర్మించారు. అరేబియా సముద్రం వైపు ఉంది.  

1011
తాజ్ మహల్ - ఆగ్రా::

తాజ్ మహల్  -  ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్  ప్రేమకు చిహ్నం. మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించాడు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.  ఇది 17వ శతాబ్దంలో నిర్మించిన స్మారక చిహ్నం. ఇది మొఘల్ పాలనలో నిర్మించబడింది 

 

1111

కుతుబ్ మినార్ ను1193లో కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ నిర్మించారు. 73 మీటర్ల ఎత్తైన మినార్ ప్రపంచంలోనే ఎత్తైన ఇటుక మినార్,  ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పంలో ఇది నిర్మించబడింది.  

Read more Photos on
click me!

Recommended Stories