Railway Station Foods: ఆహా ఏమి రుచి.. ఈ రైల్వే స్టేషన్లలో ఇవి తింటే మీరు ఇలాగే అంటారు

Published : Feb 13, 2025, 05:18 PM IST

Railway Station Foods: మీరు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు రకరకాల రైల్వే స్టేషన్లు చూస్తారు కదా.. కానీ కొన్ని స్టేషన్లు అక్కడ దొరికే ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి చెందాయి. కొంతమంది ఆహార ప్రియులు ఆ స్టేషన్లలో ఆగి అక్కడ దొరికే ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ ని తిని మరీ వెళుతుంటారు. అలాంటి కొన్ని స్పెషల్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Railway Station Foods: ఆహా ఏమి రుచి.. ఈ రైల్వే స్టేషన్లలో ఇవి తింటే మీరు ఇలాగే అంటారు

హౌరా జంక్షన్ - రసగుల్లా 
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కలకత్తా నగరంలో హౌరా జంక్షన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇది దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ లో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ దొరికే రసగుల్లా దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. ఈ స్వీట్ ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హౌరా జంక్షన్ మీదుగా ప్రయాణించే ఎక్కువ మంది ఆ స్టేషన్ లో రసగుల్లా తినకుండా వెళ్ళరు. 

25

లక్నో జంక్షన్ - టుండే కబాబ్ 
కబాబ్ గురించి వినే ఉంటారు కదా.. టుండే కబాబ్ ను ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి తయారు చేస్తారు. అందువల్ల ఈ ఐటెం ఇక్కడ చాలా ఫేమస్. లక్నో జంక్షన్లో మాత్రమే లభించే టుండే కబాబ్ తినడానికి చుట్టుపక్కల ప్రజలు తరచూ ఈ స్టేషన్ కి వస్తారు. ఈ కబాబ్ గురించి తెలిసిన వారు దీన్ని రుచి చూడకుండా వెళ్లరు. 

35

అమృత్ సర్ జంక్షన్ - కుల్చా 
అమృత్ సర్ జంక్షన్లో లభించే ఈ కుల్చాకు మరో పేరు ఉంది. దీన్ని అమృత్సరి కుల్చా అని కూడా అంటారు. దీన్ని వెన్నతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఆహార ప్రియులు కచ్చితంగా ఒకసారి అయినా టేస్ట్ చేయాల్సిన ఐటమ్ ఇది.  
 

45

ఆగ్రాలో పెఠా 
తాజ్ మహల్ చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆగ్రా రైల్వే స్టేషన్ లో ఈ ఫుడ్ ఐటెం రుచి చూసే ఉంటారు. ఎందుకంటే పెఠా అక్కడ అంత ఫేమస్ మరి. ఈ స్వీట్ చాలా సులభంగా డైజస్ట్ అయిపోతుంది. అందుకే అందరికీ బాగా నచ్చుతుంది. ఈ సారి మీరు ఆగ్రా వెళితే కచ్చితంగా పెఠా టేస్ట్ చేయండి. 

55

పాట్నా జంక్షన్ లో లిట్టీ-చోఖా 
పలకడానికి కష్టంగా ఉన్నా లిట్టీ-చోఖా ఒకసారి తిన్నారంటే ఆ రుచిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. పాట్నాలో ఎక్కువగా ఈ ఐటమ్ తింటారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే చాలామంది ప్రయాణికులు పాట్నా జంక్షన్లో దీన్ని రుచి చూడకుండా వదలరు.

click me!

Recommended Stories