ప్రయాణికులు బడ్జెట్ ప్రైస్ లో విమానప్రయాణం చేయాలంటే ముందుగు గుర్తుకువచ్చేది ఇండిగో ఎయిర్ లైన్స్. సామన్య మధ్యతరగతి ప్రజల ప్రయాణానికి కూడా అనుకూలంగా ఈ విమాన ఛార్జీలు వుంటాయి. అందువల్లే ఈ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు బాాగా దగ్గరయ్యింది.
ఇలా ఇప్పటికే ప్రయాణికులకు అతి తక్కువ ఛార్జీలకే అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇండిగో ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవాళ బుధవారం (ఫిబ్రవరి 12) నుండి ఈ ఆఫర్ ప్రారంభం అవుతోంది. మనసుకు నచ్చినవారితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నవారు ఈ ఆఫర్ ను వాడుకోవచ్చు.