వెయింటింగ్ లిస్టులో ఉన్న ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే ఇలా చేయండి

First Published | Jan 7, 2025, 7:25 PM IST

ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ మరో అద్భుతమైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా పక్కాగా కన్ఫర్మ్ అవుతుంది. అయితే మీరు ప్రయాణించే మార్గంలో తర్వాత వచ్చే ట్రైన్ లో మీకు కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

ఇండియాలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేరుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ట్రైన్. అందుకే టికెట్స్ బుక్ అవడం కష్టమైనా రైళ్లలో ప్రయాణించడానికే ప్రజలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. రైళ్లలో రద్దీ వల్ల కన్ఫర్మ్ టికెట్ పొందడం చాలా కష్టమైపోయింది. సీట్లు, బెర్త్ లు లేక విద్యార్థులు, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు చేస్తుంటారు. ఇలాంటి టికెట్ వెయిటింగ్ లిస్టు కష్టాలను తొలగించడానికి రైల్వే శాఖ ఒక చక్కటి స్కీమ్ ని తీసుకొచ్చింది. 

ఈ స్కీమ్ ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్ వస్తుంది. దీని స్కీమ్ పేరు ‘వికల్ప్ యోజన’ దీని ద్వారా మీకు సీటు లేదా బెర్త్ కచ్చితంగా దొరుకుతుంది. అయితే అది తర్వాత ట్రైన్ లో.  అంటే  మీరు రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వికల్ప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మీ టికెట్ వెయింటింగ్ లిస్టులోకి వచ్చినా తర్వాత ట్రైన్లో మీకు సీట్, బెర్త్ ఇస్తారు. 


ఉదాహరణకు మీరు విజయవాడ నుండి సికింద్రాబాద్ కి వెళ్లే రైలులో టికెట్ బుక్ చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉందనుకుందాం. చార్ట్ తయారైన తర్వాత కూడా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటే మీరు ఇంక ఆ రైలులో ప్రయాణించలేరు. క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. దీని వల్ల డబ్బులు వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ట్రైన్ లో కూడా మీరు జనరల్ టికెట్ తీసుకొనే ప్రయాణించాల్సి ఉంటుంది. 

అయితే మీరు ‘వికల్ప్’ ఆప్షన్ ని ముందుగానే క్లిక్ చేసి టికెట్ బుక్ చేస్తే విజయవాడ-సికింద్రాబాద్ దారిలో తర్వాత వెళ్లే రైలులో మీకు టికెట్ కన్ఫర్మ్ గా ఇస్తారు. ఈ సౌకర్యాన్ని మీరు 12 గంటలలోపు ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు వెళ్లే దారిలో 12 గంటలలోపు వచ్చే ట్రైన్స్ లో కన్షర్మ్ టికెట్ లభిస్తుంది. ఈ స్కీమ్ ని అన్ని రైళ్లలోనూ ఉపయోగించుకోవచ్చు.

అదనపు ఛార్జీలు ఉంటాయా? 

కానీ తర్వాత బయలుదేరే రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటేనే ఇస్తారు. మీకు మరొక రైలులో సీటు కేటాయిస్తే  అదనంగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు. ఇంతకు ముందు సూపర్ ఫాస్ట్ రైలులో బుక్ చేసుకుని, వికల్ప్ స్కీమ్ ద్వారా సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మారిస్తే తేడా ఛార్జీలు కూడా తిరిగి ఇవ్వరు. 

వికల్ప్ స్కీమ్ ని ఎలా ఎంచుకోవాలి? 

1. మీ పేరు, పాస్‌వర్డ్ ఇచ్చి IRCTC వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 

2. ప్రయాణ తేదీ, గమ్యస్థానం, ప్రయాణ తరగతి, సీటు లభ్యత వంటి వివరాలు నమోదు చేయండి.

3. ప్రయాణించే వ్యక్తి పేరు. కాంటాక్ట్ వివరాలు నమోదు చేయండి.

4. టికెట్ బుకింగ్ ని కన్ఫర్మ్ చేయడానికి డబ్బులు చెల్లించండి.

5. ఇప్పుడు స్క్రీన్ పై చూపించే వికల్ప్ స్కీమ్ ఆప్షన్ ని ఎంచుకోండి.

6. ప్రత్యామ్నాయ రైళ్ల జాబితా స్క్రీన్ పై చూపిస్తుంది. అదే మార్గంలో ప్రత్యామ్నాయ రైళ్లను ఎంచుకోవచ్చు.

Latest Videos

click me!