దీనికి సమాధానంగా రైల్వే శాఖ నుంచి రిప్లై వచ్చింది. జనరల్ కోటాలో టికెట్ బుక్ చేస్తే లోయర్ బెర్త్ ఉంటేనే కేటాయింపు జరుగుతుందని, సీట్లు లేకపోతే దొరకవని రైల్వే శాఖ తెలిపింది. అయితే ‘Lower Berth Quota’ విభాగంలోకి వెళ్లి రిజర్వేషన్ చేస్తే లోయర్ బెర్త్ దొరుకుతుందని పేర్కొంది.
జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసినప్పుడు లోయర్ బెర్త్ కావాలని ప్రిఫర్ చేసిన వృద్ధులు, మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తామని రైల్వే శాఖ తెలిపింది. అయితే సీట్లు ఖాళీగా ఉంటేనే కేటాయించగలమని, అదే ‘Lower Berth Quota’ విభాగంలోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకునే వారికి సీట్లు కేటాయించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ సీట్లు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన లభిస్తాయని వివరించింది.