భారతదేశంలో ప్రతిరోజూ 2.5 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ప్రయాణికుల సౌలభ్యం కోసం దేశంలో అనేక రైళ్లు నడుస్తూనే ఉంటాయి. ఎన్ని రైళ్లు ఉన్నా, మనకు అవసరం వచ్చినప్పుడు ట్రైన్ దొరకడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. రైళ్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ సమయాల్లో అంటే ఒకే కానీ, సెలవలు, పండగల సమయంలో ట్రైన్ దొరకడం చాలా కష్టం.
రైలు ప్రయాణం అందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే.. అందరూ ఆ ప్రయాణం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరి, మనకు ఎప్పుడు కావాలన్నా ట్రైన్ టికెట్ దొరకాలంటే, తత్కాల్ అవసరం లేకుండా కన్ఫమ్ టికెట్ ఎలా పొందాలో తెలుసుకుందాం...
కొన్నిసార్లు మనం బుక్ చేసిన టికెట్ వెయిటింగ్ లేదా ఆర్‌ఏసీ లిస్ట్‌లోకి వస్తుంది. వెయిటింగ్ టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లో ప్రయాణించలేం. అందుకే రద్దీగా ఉండే రైళ్లలో సీటు రిజర్వేషన్ చేయడం కష్టం. ఈరోజు మేము చెప్పే కోటాలో బుక్ చేస్తే 100% కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుంది.
భారతీయ రైల్వేలో హై అఫీషియల్ కోటా ఉంటుంది. ఈ కోటాలో ఎమర్జెన్సీ టికెట్లు రిజర్వ్ చేస్తారు. ఇక్కడ వెయిటింగ్ టికెట్ ఇచ్చినా కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు. సాధారణంగా ప్రభుత్వ అతిథులు, రైల్వే ఉన్నతాధికారులు, VIPలు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కోసం ఈ కోటా ఉంటుంది.
ఇండియన్ రైల్వేస్
ఈ కోటా ప్రత్యేక అధికారులు, VIPల కోసమే అయినా సామాన్య ప్రజలు కూడా ఇక్కడ కన్ఫర్మ్ టికెట్ పొందవచ్చు. ముందుగా వెయిటింగ్/ఆర్‌ఏసీ టికెట్ తీసుకోవాలి. తర్వాత కొన్ని డాక్యుమెంట్లు సమర్పించి కన్ఫర్మ్ టికెట్ పొందవచ్చు. ఈ టికెట్ బుకింగ్ సమయంలో దొరకదు.
సాధారణ టికెట్ తీసుకుని రైల్వే స్టేషన్‌కి వెళ్లాలి. అక్కడ మీ ఎమర్జెన్సీకి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించి కన్ఫర్మ్ టికెట్ కోసం దరఖాస్తు చేయాలి. అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించి కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు.