దశాబ్ద కాలంగా భారతీయ రైల్వేలో చాలా మార్పులు జరుగుతున్నాయి. చెప్పాలంటే రైళ్ళు, స్టేషన్లు చాలా మారిపోయాయి. ఒకప్పుడు మురికిగా ఉన్నస్టేషన్లు కూడా ఇప్పుడు క్లీన్ గా, నీట్ గా తయారయ్యాయి. అయితే, కొన్ని రైళ్ళలో మాత్రం ఇప్పటికీ ప్రాథమిక పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం లేదు. అలాంటి రైళ్ళలో ప్రయాణించడం ప్రయాణికులకు చేదు అనుభవాన్ని ఇస్తుంది.