Travel Mistakes: ట్రిప్‌ ప్లాన్ చేశారా? ఈ 10 తప్పులు మాత్రం అస్సలు చేయకండి

Published : Mar 02, 2025, 08:24 PM IST

Travel Mistakes: ప్రయాణం ఒక గొప్ప అనుభవం. అయితే ఒక్కోసారి మనకి తెలియకుండా చేసే చిన్న పొరపాట్ల వల్ల జర్నీ మొత్తం చిరాగ్గా మారుతుంది. ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు సాధారణంగా చేసే 10 తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని ఎలా నివారించాలో కూడా ఇక్కడ చూద్దాం.

PREV
15
Travel Mistakes: ట్రిప్‌ ప్లాన్ చేశారా? ఈ 10 తప్పులు మాత్రం అస్సలు చేయకండి

1. ఎక్కువ లగేజీ

లాంగ్ ట్రిప్ అనే సరికి కొందరు ఎక్కువ లగేజీ ప్యాక్ చేసేస్తారు. సామాను ఎక్కువగా ఉంటే విమానాశ్రయాలు, హోటళ్లు, రవాణాలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవసరమైన డ్రెస్సులు మాత్రమే తీసుకెళ్లండి.

2. ఎక్కువ ప్రదేశాలు చూడాలనుకోవడం

తక్కువ సమయంలోనే అన్నీ చూడాలని అనుకుంటే విసుగు వస్తుంది. కాబట్టి రిలాక్స్ అవ్వడానికి కూడా సమయం కేటాయించండి.

25

3. బ్యాంకుకు చెప్పడం మర్చిపోవడం

విదేశాలకు ట్రిప్ వెళితే బ్యాంకుకు చెప్పకుండా మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఆ దేశాల్లో వాడితే మీ లావాదేవీలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందే మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వండి.

4. ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకోకపోవడం

లాంగ్ టూర్ లేదా విదేశాలకు ట్రిప్ కి వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్, వీసా లేదా టిక్కెట్లు పోతే చాలా కష్టం. అందుకే వాటి జిరాక్సులు తీసుకొని దగ్గర పెట్టుకోండి. 

35

5. ట్రావెల్ ఇన్సూరెన్స్ పట్టించుకోకపోవడం

ట్రావెల్ ఇన్సూరెన్స్ డబ్బు ఆదా చేస్తుంది అనుకుంటారు. కానీ ఊహించని సంఘటనలు జరిగితే ఇది మీ కుటుంబానికి లేదా మీపై ఆధారపడి జీవిస్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది.

6. టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడటం

స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగకరమే కానీ, ఒక్కోసారి సిగ్నల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. మ్యాప్ లేదా అడ్రస్ రాసి పెట్టుకోవడం మంచిది.

45

7. స్థానిక ఆచారాలు తెలుసుకోకపోవడం

ప్రతి ప్రదేశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని గౌరవించడం ముఖ్యం. ఎందుకంటే వాళ్ల ఆచారాలకు మనం గౌరవం ఇస్తే స్థానికులు మనకు ఎలాంటి సహాయం అయినా చేస్తారు.

8. వీసా రూల్స్ తెలుసుకోకపోవడం

చాలామంది వీసా లేకుండానే వేరే దేశాలకు వెళ్లాలని చూస్తారు. ఇది చట్టరీత్యా నేరం. దీని వల్ల జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల వీసా తప్పనిసరి.

55

9. డబ్బు మార్చుకోవడం

ఎయిర్‌పోర్టులో డబ్బు మార్చుకుంటే ఎక్కువ ఛార్జీలు తీసుకుంటారు. లోకల్ బ్యాంకులో మార్చుకుంటే మంచిది.

10. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం

స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగకరమే కానీ, ఒక్కోసారి సిగ్నల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. మ్యాప్ లేదా అడ్రస్ రాసి పెట్టుకోవడం మంచిది.

click me!

Recommended Stories