IRCTC కర్ణాటకలోని దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల కోసం ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుండి విమానంలో 6 రోజుల టూర్ ఇది. ఇందులో గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి.
దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఇలా తెలుగు ప్రజలు కూడా తమవారితో కలిసి సరదాగా పక్కరాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాలను చుట్టివచ్చేలా IRCTC అద్భుతమైన టూరిజం ప్లాన్ ను సిద్దంచేసింది.
తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్లైట్ జర్నీతో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 పగళ్లు టూర్ ఉంటుంది.
24
IRCTC Karnataka Tour Package
మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్లైట్ (6E 7549)లో జర్నీ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి హోటల్‌కు వెళ్తారు.
బ్రేక్ ఫాస్ట్ అనంతరం మంగళదేవి, కద్రి మంజునాథ దేవాలయాలకు వెళతారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ దేవాలయం సందర్శిస్తారు. రాత్రి మంగుళూరులోనే స్టే ఉంటుంది.
రెండో రోజు ఉడిపి ట్రిప్ ఉంటుంది. మంగుళూరు నుండి ఉడిపికి చేరుకుని హోటల్ కు వెళ్ళి ప్రెషప్ అవుతారు. మధ్యాహ్నం సెయింట్ మేరీ ఐలాండ్, మల్ఫే బీచ్... సాయంత్రం శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి రాత్రి ఉడిపిలోనే స్టే చేస్తారు.
34
IRCTC Karnataka Tour Package
మూడవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోరనాడుకు వెళతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి టెంపుల్‌ను దర్శించి, శృంగేరికి వెళతారు. శృంగేరి శారదాంబ టెంపుల్‌ను చూసిన తర్వాత ఉడిపికి తిరిగి వస్తారు. రాత్రి ఇక్కడే స్టే ఉంటుంది.
నాలుగోరోజు ఉదయమే గోకర్ణ బయలుదేరతారు. అక్కడ టెంపుల్, బీచ్ ను చూసి మురుడేశ్వర్ కి బయలుదేరతారు. అక్కడ దర్శనం తర్వాత తిరిగి ఉడిపికి చేరుకుంటారు. నాలుగో రోజు రాత్రి కూడా ఉడుపిలోనే స్టే ఉంటుంది.
44
IRCTC Karnataka Tour Package
ఐదవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ధర్మస్థలకు వెళ్లి మంజునాథ టెంపుల్‌ను దర్శించుకుంటారు. అక్కడ స్వామిని దర్శించుకున్నాక కుక్కే సుబ్రమణ్యకు వెళతారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
ఆరోరోజు సుబ్రహ్మణ్యస్వామి దర్శనం అనంతరం తిరిగి మంగుళూరుకు బయలుదేరతారు. మద్యాహ్నం మంగుళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుండి విమానంలో రాత్రి 7 గంటలవరకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో హైదరాబాద్ టు కర్ణాటక ట్రిప్ ముగుస్తుంది.