రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం - రాఫెల్ నాదల్ సంపాద‌న, గెలిచిన టైటిల్స్ ఇవే

First Published | Oct 10, 2024, 5:46 PM IST

Rafael Nadal : టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను నవంబర్‌లో డేవిస్ కప్‌తో తన చివరి టోర్నమెంట్‌ను ఆడ‌నున్న‌ట్టు పేర్కొన్నాడు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ స‌హా ఇప్ప‌టివ‌ర‌కు విజ‌వంత‌మైన కెరీర్ ను నాద‌ల్ కొన‌సాగించారు.
 

Rafael Nadal

Tennis legend Rafael Nadal : టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్‌లో త‌న చివ‌రి మ్యాచ్ ను ఆడ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. రాఫెల్ నాదల్ 22 టైటిళ్లను గెలుచుకోవడంతో ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న రెండో ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించాడు. స్పానిష్ ఆటగాడు చాలా భావోద్వేగ వీడియో సందేశంలో త‌న‌ రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న చేశారు.

Rafael Nadal

రాఫెల్ నాద‌ల్ రిటైర్మెంట్ - ఎమోషనల్ అయిన టెన్నిస్ లెజెండ్

రాఫెల్ నాద‌ల్ త‌న రిటైర్మెంట్ గురించి ప్ర‌క‌టిస్తూ తీవ్ర ఎమోష‌న‌ల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. సంబంధిత‌ వీడియోలో రాఫెల్ నాద‌ల్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా ఉన్న కెరీర్ తర్వాత నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నాను. రిటైర్మెంట్  నిర్ణయం చాలా కష్టమైంది. ఇటీవలి సంవత్సరాల సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా సమయం పట్టిందని పేర్కొన్నాడు. 

రఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటన అతని అభిమానుల‌తో పాటు టెన్నిస్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు ప‌లికే స‌మ‌యం వ‌చ్చింద‌ని పేర్కొన్న రాఫెల్ నాద‌ల్.. ఆ త‌ర్వాత యంగ్ ప్లేయ‌ర్ల కెరీర్‌ను మెరుగుపరచడానికి ఆట‌లో త‌న ప్ర‌యాణం కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. 

Latest Videos


Rafael Nadal

డేవిస్ కప్‌లో చివ‌రి మ్యాచ్ ఆడ‌నున్న రాఫెల్ నాద‌ల్

రాఫెల్ నాద‌ల్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టించినా రాబోయే డేవిస్ క‌ప్ లో తాను ఆడ‌తాన‌నీ, అదే త‌న కెరీర్ లో చివ‌రి ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్న‌మెంట్ అవుతుంద‌ని తెలిపాడు. డేవిస్ క‌ప్ నవంబర్ 19-24 మధ్య మాలాగాలో జ‌ర‌గ‌నుంది. రాఫెల్ నాద‌ల్ స్పెయిన్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

నాదల్ ఇటీవలి సంవత్సరాలలో గాయాలతో పోరాడుతున్నాడు. 38 ఏళ్ల రాఫెల్ నాదల్ గాయాల కారణంగా పరిమిత టోర్నీలు ఆడాడు. ఇంకా ఆట‌లో కొన‌సాగ‌డం క‌ష్టం కావ‌డంతో ఆయ‌న రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని టెన్నిస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన రెండో ఆటగాడు రఫెల్‌ నాదల్‌. అతను 22 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు. అతని పైన 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన నొవాక్ జకోవిచ్ టాప్ లో ఉన్నారు.

Image credit: Getty

రాఫెల్ నాద‌ల్ సంపాద‌న ఎంత‌? 

చరిత్రలో గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకరిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు రాఫెల్ నాదల్. ఆద్భుత‌మైన ఆట‌తో ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ గా కూడా త‌న స‌త్తా చాటారు. ఆట‌లోనే కాదు సంపాద‌న‌లో తోపు అని నిరూపించారు. 

రాఫెల్ నాదల్ ను తరచుగా "కింగ్ ఆఫ్ క్లే" అని పిలుస్తారు. ఈ కోర్టులో అద్భుత‌మైన విజ‌యాలో కెరీర్ కొన‌సాగించారు. వెబ్‌సైట్ మార్కా ప్రకారం 2024 నాటికి రాఫెల్ నాదల్ నికర విలువ సుమారు $225 మిలియన్లుగా అంచనా. అత‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుడైనా టెన్నిస్ ఆటగాళ్లలో ఒకరిగా, అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్‌లలో ఒకడిగా నిలిచాడు. 

రాఫెల్ నాదల్ ఆదాయంలో ఎక్కువ భాగం టోర్నమెంట్ విజయాల నుండి వచ్చింది. అతని కెరీర్ మొత్తంలో $135 మిలియన్లకు పైగా కేవలం ప్రైజ్ మనీ ద్వారా లభించిందని ఫోర్బ్స్‌లో నివేదిక‌లు పేర్కొన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం 2024లో మొత్తం సంపాదన $23.3 మిలియన్లతో అత్యధికంగా చెల్లించే అథ్లెట్లలో రాఫెల్ నాద‌ల్ కూడా ఉన్నారు.

టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాద‌ల్ ఎన్ని గ్రాండ్ స్ల‌మ్స్ గెలుచుకున్నారు? అత‌ని రికార్డులు ఏమిటి? 

రాఫెల్ నాదల్ తన కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009, 2022)
ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022)
వింబుల్డన్ (2008, 2010)
యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017, 2019)

ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ రికార్డులు ఏమిటి?

రాఫెల్ నాదల్ 2005లో ఫ్రెంచ్ ఓపెన్‌లో అరంగేట్రం చేసాడు. రోలాండ్ గారోస్‌లో 112-4 గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు. 2009లో రాబిన్ సోడర్లింగ్ చేతిలో నాల్గవ రౌండ్‌లో నాకౌట్ అయ్యాడు.  అయితే అతను 2015 క్వార్టర్-ఫైనల్, 2021 సెమీ-ఫైనల్స్‌లో నోవాక్ జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. 2016లో నాదల్ మణికట్టు గాయం కారణంగా తన మూడవ రౌండ్ మ్యాచ్‌కు ముందు వైదొలిగాడు. 2023లో తుంటి గాయం నుండి పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడంలో విఫలమైన తర్వాత అతను ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ చేత 2024లో రోలాండ్ గారోస్‌లో మొదటి రౌండ్‌లో నాకౌట్ అయ్యాడు. నాదల్ యూఎస్ ఓపెన్‌లో నాలుగు ట్రోఫీలు, వింబుల్డన్ - ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఒక్కొక్కటి రెండు ట్రోఫీలను గెలుచుకున్నాడు. గ్రాండ్ స్లమ్స్ కూడా ఉన్నాయి. 2024 సీజన్ చివరిలో తాను రిటైర్ అవుతాన‌ని ప్ర‌క‌టించాడు.

click me!