కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం: మోడీని పిలువని కేసీఆర్, భయం అదేనా..

First Published Jun 19, 2019, 12:20 PM IST

తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పలువురు అతిథులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఆయన ఆహ్వానించారు.

హైదరాబాద్: తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పలువురు అతిథులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఆయన ఆహ్వానించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం ఆహ్వానించలేదు.
undefined
గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. గోదావరి జలాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటాలు ఉన్నాయి. ఆ కారణంగా కేసీఆర్ ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారని అనుకోవచ్చు. అది ఒక రకంగా జల వివాదాలు ముదరకుండా ఉపయోగపుడుతుందని భావించవచ్చు. ఈ విషయంలో కేసీఆర్ తెలివిగానే వ్యవహరించారనే మాట వినిపిస్తోంది.
undefined
నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తానని ఆ మధ్య కేసీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పే గైర్హాజరయ్యారు. అదే సమయంలో మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాను వెళ్లకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన కుమారుడు కేటీ రామారావును పంపించారు. మొత్తం మీద, మోడీని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ఉద్దేశం కేసీఆర్ కు లేదని అర్థమవుతోంది.
undefined
ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం కేసీఆర్ ఆహ్వానించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, అందువల్ల ఆహ్వా నించలేదని సమాధానపడవచ్చు. కానీ, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి, మిషన్ భగీరథకు మోడీని ఆహ్వానించి కేసీఆర్ సందడి చేశారు. అటువంటి స్థితిలో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించకపోవడం వెనక కారణాలేమై ఉంటాయనే చర్చ సాగుతోంది.
undefined
మోడీని కేసీఆర్ ఆహ్వానించకపోవడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో బిజెపిపై కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు. ఇప్పటికి కూడా తాను ఫెడరల్ ఫ్రంట్ కు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. ఇది కూడా మోడీని ఆహ్వానించకపోవడం వెనక ఓ కారణమై ఉండవచ్చునని అంటున్నారు.
undefined
మరో ప్రధానమైన అంశం కూడా ఉంది. తెలంగాణలో ప్రతిపక్షమంటూ లేకుండా చేయాలని కేసీఆర్ మొదటి నుంచి రాజకీయ వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు. తొలి విడత తెలుగుదేశం పార్టీని ఆయన లక్ష్యం చేసుకుని నామరూపాలుు లేకుండా చేశారు. రెండో విడత కాంగ్రెసును లక్ష్యం చేసుకుని ప్రతిపక్ష హోదాకు ఎసరు పెట్టారు. అయితే, కేసీఆర్ వ్యూహానికి బిజెపి గండి కొట్టే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు.
undefined
లోకసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో బిజెపి రాష్ట్రంలో ఓ ఊపు వచ్చింది. తెలంగాణలో పాగా వేయడానికి బిజెపి పకడ్బందీ వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాదు నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారనే మాట వినిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి పిరాయింపులను ప్రోత్సంహించి బిజెపి తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ స్థితిలో మోడీని ఆహ్వానిస్తే బిజెపి కార్యాచరణకు బలం చేకూర్చినట్లవుతుందని కేసీఆర్ భావించి ఉండవచ్చునని అంటున్నారు.
undefined
click me!