అది ఉత్తమ్‌కు వర్తించదా: కాంగ్రెస్ నేతల సూటి ప్రశ్న

First Published Sep 24, 2019, 2:51 PM IST

తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్క కుటుంబానికి ఒకే టిక్కెట్లు అనేది అందరికీ వర్తించదా అనే చర్చ సాగుతోంది. అయితే ఈ నిబంధన అమలులో కొందరికి మినహాయింపులు ఉండడంపై  కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఒకే కుటుంబానికి ఒకే సీటు అనే నిబంధన కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల కుటుంబాలకు వర్తించదా అని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్ల కోసం ప్రయత్నించి కొందరు కాంగ్రెస్ సీనియర్లు విఫలమయ్యారు.
undefined
కానీ, హుజూర్‌నగర్ లో పద్మావతికే కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది. అధికారికంగా ఆమె పేరును ప్రకటించడమే తరువాయి. అయితే కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్టు అనే నిబంధన అమలు విషయంలో మాత్రం షరతులు వర్తిస్తాయనే చర్చ కూడ లేకపోలేదు.
undefined
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుండి ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నుండి పోటీ చేయడానికి ప్రయత్నించారు.
undefined
సబితా ఇంద్రారెడ్డికి మాత్రమే మహేశ్వరం టిక్కెట్టు దక్కింది. కానీ, కార్తీక్ రెడ్డికి మాత్రం రాజేంద్రనగర్ టిక్కెట్టు దక్కలేదు. పొత్తులో భాగంగా ఈ సీటును టిడిపికి కేటాయించారు. ఈ సమయంలో కార్తీక్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టిక్కెట్టును ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు.
undefined
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడ చేవేళ్ల సీటును కార్తీక్ రెడ్డికి కాకుండా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కేటాయించారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆమె కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు.
undefined
నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి తన కొడుకుకు టిక్కెట్టు కోసం జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ స్థానాన్ని బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు కాంగ్రెస్ కేటాయించింది. ఆ సమయంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కృష్ణయ్య ఉన్నారు.
undefined
అయితే ఆ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుండి ఉత్తమ్ భార్య పద్మావతికి టిక్కెట్టు కేటాయించారు. ఆ ఎన్నికల సమయంలో ఒక్క కుటుంబానికి ఒక్కరికే టిక్కెట్టు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ప్రకటన ఆధారంగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది.,తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఇదే పద్దతిని అవలంభించింది.
undefined
అయితే హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతిని బరిలోకి దింపనుంది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ ఎంపీ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించినందున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
undefined
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పద్మావతిని కాంగ్రెస్ బరిలోకి దింపనుంది.ఆమె పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుంది. అయితే ఒకే కుటుంబానికి ఒక్క టిక్కెట్టు అనేది ఉత్తమ్ కుటుంబానికి వర్తించడం లేదు.
undefined
ఇదే సూత్రం కోమటిరెడ్డి సోదరులకు వర్తించలేదు. గత ఎన్నికల్లో మునుగోడు, నల్గొండ అసెంబ్లీ స్థానాల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేశారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం విజయం సాధిస్తే వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో భువనగిరి ఎంపీ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
undefined
గతంలో టిక్కెట్లు దక్కని కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ రెండు ఉదంతాలను ప్రస్తావిస్తూ ఒకే కుటుంబానికి ఒక్క టిక్కెట్టు అనే నిబంధన అనేది షరతుల ప్రాతిపదికనే ఉంటుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
undefined
తాము కోరుకొన్నట్టుగా కొందరికి టిక్కెట్లు కేటాయిస్తే మరికొన్ని సీట్లు కాంగ్రెస్ కు దక్కేవనే అభిప్రాయాలను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బలమైన నేతలకు టిక్కెట్లు కేటాయించడంలో నిబంధనలను పక్కకు పెట్టాలని కూడ కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
undefined
click me!