రంగంలోకి తమిళిసై: కేసీఆర్ కు ప్రజా దర్బార్ సవాల్

First Published Sep 17, 2019, 6:01 PM IST

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమింపబడ్డప్పటినుండి తెరాస తరుఫు నుంచి ఏదో ఒక రూపంలో నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం కోసం ఇలా ఒక యాక్టీవ్ (క్రియాశీలక) పొలిటీషియన్ ని నియమించిందని తెరాస ఆరోపిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సీపీఆర్వో జ్వాలా నరసింహారావు ఏకంగా ఒక ఆంగ్ల పత్రికలో ఇలా క్రియాశీలక పొలిటీషియన్ లను రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేందుకే కేంద్రాలు నియమిస్తాయన్నాడు

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమింపబడ్డప్పటినుండి తెరాస తరుఫు నుంచి ఏదో ఒక రూపంలో నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం కోసం ఇలా ఒక యాక్టీవ్ (క్రియాశీలక) పొలిటీషియన్ ని నియమించిందని తెరాస ఆరోపిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సీపీఆర్వో జ్వాలా నరసింహారావు ఏకంగా ఒక ఆంగ్ల పత్రికలో ఇలా క్రియాశీలక పొలిటీషియన్ లను రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేందుకే కేంద్రాలు నియమిస్తాయన్నాడు.
undefined
ఇలా పరోక్ష ఆరోపణలు చేయడం మినహా తెరాస సర్కార్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో నిన్న ట్విట్టర్ వేదికగా తాను ప్రజా దర్బారును నిర్వహించనున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు.వారానికి ఒకసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తే బాగుంటుందని, ప్రజలు తమ బాధలను, సమస్యలను వినిపించుకోవడానికి ఒక వేదిక దొరుకుతుందని ఒక ఎంబిటి నేత ట్విట్టర్లో గవర్నర్ తమిళిసై ని కోరాడు. దీనికి స్పందించిన తమిళిసై అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అభిప్రాయం ఇప్పటికే మా పరిగణలో ఉంది అని తెలిపారు
undefined
దీన్నిబట్టి ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే గవర్నర్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో వింతేముంది పాత గవర్నర్ నరసింహన్ కూడా ఇలా ప్రజాదర్బార్ నిర్వహించారు కదా అనుకోవచ్చు. కాకపోతే నరసింహన్ ఏదో ఆలా ఒక ఫార్మాలిటీకి మాత్రమే నిర్వహించేవారు. అదీ కేవలం ఏ పండుగకు పబ్బానికో మాత్రమే. కానీ, ప్రస్తుత గవర్నర్ తమిళిసై మాత్రం ఇలా ఒక తంతుగా కాకుండా రెగ్యులర్ గా నిర్వహించనున్నారు.
undefined
దీనికి తోడు నరసింహన్ కు, కెసిఆర్ కు కొద్దిగా సన్నిహిత సంబంధాలుకూడా ఉండేవి. గత దఫాలో తెరాస కు బీజేపీకి ఒక అప్రకటిత మైత్రి ఉండేది. 2019 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను సొంతగా చేరుకోలేకపోతే తెరాస అవసరం ఉంటుందేమో అని వేచి చూసింది. కానీ వారే 300పైచిలుకు రికార్డు సీట్లను సాధించడం, తెలంగాణాలో కెసిఆర్ కూతురు కవితనే ఓడించడం, 4 సీట్లతో రెండో స్థానంలో నిలవడంతో బీజేపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కర్ణాటక తరువాత దక్షిణ భారత దేశంలో తమకు ఆస్కారమున్న రెండో రాష్ట్రంగా బీజేపీ తెలంగాణను పరిగణిస్తుంది. దీనితో ఇప్పుడు కెసిఆర్ ను నేరుగా టార్గెట్ చేసే పనిలో నిమగ్నమయ్యింది.
undefined
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆక్టివ్ పొలిటీషియన్ ని తెలంగాణకు గవర్నర్ గా నియమించారు. ఇప్పుడు తానేమో ప్రజాదర్బార్ నిర్వహిస్తాను అంటోంది. ఇది తెరాస ను చాలా తీవ్రంగా ఇబ్బందిపెట్టనున్న అంశంగా కనపడుతుంది. ఒకపక్కనేమో తెరాస బాస్ కెసిఆర్ ఏమో ప్రజలకు అందుబాటులో ఉండరు. తాను సచివాలయానికి రారు. అమెరికా ప్రసిడెంట్ ఎక్కిన ఏ విమానమైనా ఎయిర్ ఫోర్స్-వన్ అయినట్టు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అని అన్నారు
undefined
ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో గవర్నర్ గనుక ప్రజాదర్బార్ నిర్వహించడం మొదలుపెడితే, ప్రజలు ఖచ్చితంగా తమ సమస్యలతో గవర్నర్ దగ్గరికి వెళతారు. వారు నేరుగా వెళ్లకున్న, బీజేపీ నాయకులు ప్రజాసమస్యలపై పోరాటం పేరుతో ఉన్న అన్ని సమస్యలను ఎత్తుకొని ప్రజలను వెంటేసుకొని రెగ్యులర్ గా రాజ్ భవన్ చుట్టూ ట్రిప్పులు కొడతారు.
undefined
ఇలా ఒక ఆక్టివ్ పొలిటీషియన్ ని గవర్నర్ గా పంపిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం పుదుచ్చేరి విషయంలో చూస్తూనే ఉన్నాం. అక్కడి గవర్నర్ కిరణ్ బేడీ పాలక కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయలా పరిణమించింది. తాను కూడా అక్కడ గవర్నర్ హోదాలో ప్రజాదర్బారును నిర్వహిస్తుంది. రోడ్ల మీద ఉన్న గుంతల దగ్గర నుంచి ట్రాఫిక్ సమస్యల వరకు ఇలా ప్రతి విషయంలోనూ అధికారులతో సమావేశమవుతుంటారు. కిరణ్ బేడీ సోషల్ మీడియాలో కూడా చాల ఆక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లతో పాటు యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయింటేన్ చేస్తున్నారు. ఇలా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు.
undefined
హైదరాబాద్: తన ముఖ్యమంత్రి పదవిపై, కేటీఆర్ ను ప్రమోట్ చేసే విషయంపై తెలంగాణ సిఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఆదివారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తాను అమెరికా వెళ్లి వైద్యం చేయించుకుంటానని ప్రచారం సాగించారని, అందుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు.
undefined
click me!