Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం

Published : Jul 25, 2026, 08:18 AM IST

నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేమీ లేకున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలతో కాదు పిడుగులు, ఈదురుగాలులతో ప్రమాదాలు పొంచివున్నాయని హెచ్చరిస్తున్నారు.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Weather Update : దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో వర్షాలు తీవ్రరూపం దాల్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కుంభవృష్టి కురుస్తోంది... రికార్డు వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ నుండడి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. 

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి వర్షాలు కాకున్నా మంచి వానలే పడుతున్నాయి. గత వారంరోజులుగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.. రాజధాని హైదరాబాద్ లో కూడా మంచి వర్షపాతమే నమోదయ్యింది. నిన్నటి (జూలై 24) నుండి మళ్లీ వర్షాలు తగ్గాయి... అయితే ఇవాళ (జూలై 25, శనివారం)) వర్షాలు తిరిగి మొదలవుతాయని... రేపటి (జూలై 26, ఆదివారం) నుండి మరింత ఊపందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

25
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి చల్లని ఆహ్లాదకర వాతావరణం ఉంటుందట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో పెద్దగా వర్షాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

35
జూలై లాస్ట్ వీక్ లో జోరువానలు

తెలంగాణలో జూలై 26 అంటే ఆదివారం నుండి వర్షాలు జోరందుకుంటాయని వెదర్ మ్యాన్ తెలిపారు. తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వానలు దంచికొడతాయని... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇలా జూలై లాస్ట్ వీక్ మొత్తం జోరువానలు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ వర్షాలతో నదులు, వాగులు వంకల్లో ప్రవాహం పెరుగుతుందని... జలాశయాలు, చెరువుల్లో నీటిమట్టం పెరుగుతుందని తెలిపారు.

45
ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం

ఇవాళ (జూలై 25 శనివారం) ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలకు పిడుగులు తోడయ్యి ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

వర్ష సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరించారు. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షంవల్ల కరెంటు తీగలు తెగిపడటం, ప్లెక్సీలు, హోర్డింగ్ లు కూలడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు... కాబట్టి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

55
దేశవ్యాప్తంగా వర్షభీభత్సం.. గోదావరి ఉగ్రరూపం

దేశంలోని పలు ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో వర్షభీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఎగువన మహారాష్ట్ర, ఇతర పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో జలాశయాల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను, లంక గ్రామాల నివాసులను అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు సహాయక బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories